బీబీనగర్ ఎఐఐఎమ్ఎస్ లో మౌలిక సదుపాయాల ను వృద్ధి చెందింప చేయడం తెలంగాణ కు మేలు ను చేకూర్చుతుంది. అంతేకాకుండా ఒక ఆరోగ్యదాయకమైన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయాసల కు గతి ని జోడిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఎఐఐఎమ్ఎస్ బీబీనగర్ లో అత్యధునాతనమైనటువంటి నూతన సదుపాయాల కు 2023 ఏప్రిల్ 8వ తేదీ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు అంటూ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మండావియా ఒక ట్వీట్ లో తెలియ జేశారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ –
‘‘బీబీనగర్ ఎఐఐఎమ్ఎస్ లో మౌలిక సదుపాయాల ను వృద్ధి చెందింప చేయడం తెలంగాణ కు మేలు చేకూర్చుతుంది. అంతేకాకుండా ఒక ఆరోగ్యదాయకమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు మనం చేపడుతున్న ప్రయాసల కు జోరు ను కూడా జోడిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
The augmenting of infrastructure at AIIMS in Bibinagar will benefit Telangana and add momentum to our ongoing efforts of creating a healthy India. https://t.co/5NW6Crqf30
— Narendra Modi (@narendramodi) April 6, 2023
బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం తెలంగాణకు ప్రయోజనం చేకూర్చి,ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలు మరింత ముమ్మరం కావడానికి దోహదపడుతుంది. https://t.co/5NW6Crqf30
— Narendra Modi (@narendramodi) April 6, 2023