ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బిహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో సుమారు రూ.12,800 కోట్ల విలువైన రైలు, రోడ్డు, పెట్రోలియం, సహజవాయువుకు సంబంధించిన బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన , జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, బెట్టియా భూమి స్వాతంత్ర సంగ్రామాన్ని పునరుజ్జీవింపజేసి, ప్రజల్లో కొత్త చైతన్యాన్ని నింపిందని అన్నారు. ;ఇదే భూమి మహాత్మా గాంధీని మోహన్ దాస్ గారి నుండి సృష్టించింది ; అని ప్రధాన మంత్రి
వ్యాఖ్యానించారు, వికసిత్ బీహార్ , వికసిత్ భారత్ ల సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బెట్టియా , చంపారన్ లను మించిన మంచి ప్రదేశం మరొకటి లేదని నొక్కి చెప్పారు. రాష్ట్రంలోని వివిధ లోక్ సభ, విధాన సభ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్య లో ప్రజలు నేటి వికసిత్ బీహార్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ప్రధాన మంత్రి
ప్రస్తావిస్తూ, కొత్త అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ;బీహార్ భూమి శతాబ్దాలుగా దేశానికి అద్భుతమైన నాయకత్వాన్ని చూపించింది దేశం కోసం ఎందరో గొప్ప వ్యక్తులను కూడా అందించింది ; అని ప్రధాన మంత్రి అన్నారు, బీహార్ సౌభాగ్యంతో భారతదేశం కూడా సుభిక్షంగా ఉందని, అందుకే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి బీహార్ రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని గుర్తు చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటంతో వికసిత్ బిహార్ కు సంబంధించిన అభివృద్ధి పనులు కొత్త ఊపందుకున్నాయని, రైలు, రోడ్డు, ఇథనాల్ ప్లాంట్లు, సిటీ గ్యాస్ సరఫరా, ఎల్ పిజి గ్యాస్ వంటి రంగాలతో సహా నేటి ప్రాజెక్టులను ప్రధాని
మోదీ ప్రస్తావించారు. వికసిత్ బీహార్ సంకల్పాన్ని సాధించడానికి ఈ వేగాన్ని కొనసాగించాలని ఆయన నొక్కి చెప్పారు.
బీహార్ లో నెలకొన్న తీవ్రమైన సమస్యల్లో ఒకటైన శాంతిభద్రతలు, వారసత్వ రాజకీయాల కారణంగా యువత రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ;బీహార్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ లక్ష్యం బీహార్ లోనే ఆ రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించడం ; అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. నేటి ప్రాజెక్టుల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది ఉపాధి కోసం చూస్తున్న యువతేనని ఆయన పేర్కొన్నారు. గంగా నదిపై పాట్నా వద్ద దిఘా-సోనేపూర్ రైల్ కమ్-రోడ్ బ్రిడ్జికి సమాంతరంగా గంగానదిపై ఆరు వరుసల కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గంగా నదిపై ఐదు వంతెనలతో సహా రూ.22,000 కోట్ల కేటాయింపుతో బీహార్ లో డజనుకు పైగా
వంతెనల పనులు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. ;ఈ వంతెనలు, విశాలమైన రహదారులు అభివృద్ధికి బాటలు వేస్తాయి” అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలు ఉపాధికి కొత్త మార్గాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు. దేశంలో వేస్తున్న రైలు మార్గాలు, రైళ్లు పూర్తిగా మేడ్ ఇన్ ఇండియావేనని, తద్వారా పౌరులకు ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్ లో ఆధునిక రైలు ఇంజిన్ తయారీ కర్మాగారాలను ప్రస్తుత ప్రభుత్వమే ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. డిజిట ల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి డిజిటల్ స దుపాయాలు లేవని అన్నారు. డిజిటల్ సేవలను వేగంగా అందిపుచ్చుకున్నందుకు భారత దేశ యువత ను ఆయన కొనియాడారు. “భారత యువతకు అడుగడుగునా అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారని, ఈ రోజు తాను బీహార్ యువతకు ఈ హామీ ఇస్తున్నానని చెప్పారు. మోడీ హామీ అంటే హామీ నెరవేరే గ్యారంటీ” అని ఆయన అన్నారు.
భారతదేశంలోని ప్రతి ఇంటిని సూర్య ఘర్ గా మార్చాలని, అక్కడ డాబాలపై సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్ ను ప్రభుత్వానికి తిరిగి విక్రయించి పౌరులకు అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చని ప్రధాన మంత్రి వివరించారు. వంశపారంపర్య రాజకీయాల దురాచారాల గురించి
ప్రజలను హెచ్చరించిన ప్రధాని, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్, జై ప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ ఆశయాలను గుర్తు చేసుకున్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ, ఉచిత రేషన్ పథకం, ఆయుష్మాన్ భారత్ పథకం, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్, ట్యాపింగ్ వాటర్ కనెక్షన్, ఏఐఐఎంఎస్ లు, ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర మెడికల్ కాలేజీలను రికార్డు స్థాయిలో ఏర్పాటు చేయడం, రైతులను ఉర్జాదాతా, ఉర్వారకదాతగా మార్చడం, చెరకు , వరి రైతులు ఉపఉత్పత్తులను ఉపయోగించుకోవడానికి ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం వంటి పథకాలను ప్రధాని ప్రస్తావించారు. చెరకు కొనుగోలు ధరను క్వింటాలుకు రూ.340కి పెంచామని, ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకాన్ని ప్రారంభించామని, దేశంలో, బిహార్ లో వేలాది
గిడ్డంగులను నిర్మిస్తామని ప్రధాని ఇటీవల తెలిపారు. రైతులకు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రస్తావిస్తూ, ఈ పథకం కింద బెట్టియాకు చెందిన రైతులకు ఇప్పటివరకు రూ .800 కోట్లు అందించామని శ్రీ మోదీ తెలియజేశారు. బరౌనీలో ఎరువుల కర్మాగారం చాలాకాలంగా మూతపడిందని, దాన్ని మళ్లీ పునరుద్ధరించి నడుపుతామని హామీ ఇచ్చింది మోదీయేనని ప్రధాని పేర్కొన్నారు. నేడు ఈ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ తన సేవలను అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. అందుకే ప్రజలు అంటున్నారు – మోడీ హామీ అంటే హామీ నెరవేరే గ్యారంటీ అని ఆయన అన్నారు. అయోధ్య ధామ్ లో శ్రీ రామ మందిరంపై బీహార్ ప్రజల ఆనందాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. నేడు భారతదేశం తన వారసత్వాన్ని, సంస్కృతిని గుర్తిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో ప్రకృతిని ప్రేమించే థారు తెగ ఉనికిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ థారు కమ్యూనిటీని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు ;ఈ రోజు, భారతదేశం ప్రకృతిని పరిరక్షిస్తూ అభివృద్ధి చెందుతోంది, థారు వంటి తెగల నుండి ప్రేరణ పొందింది. అందుకే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరి కృషి,
ప్రతి ఒక్కరి స్ఫూర్తి , ప్రతి ఒక్కరి అభ్యాసం అవసరమని నేను చెబుతున్నాను; అని ఆయన అన్నారు.
చివరగా, భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం, పేదరికం నుండి ప్రజలను బయటకు తీసుకురావడం, యువతకు ఉద్యోగాలు, పేదలకు పక్కా గృహాలు, కోటి కుటుంబాలకు సోలార్ ప్యానెల్స్, 3 కోట్ల లఖ్పతి దీదీలు , వందే భారత్ వంటి ఆధునిక రైళ్లను నడపడం ప్రాముఖ్యతను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ శ్రీ ఆర్ వి అర్లేకర్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి , శ్రీ విజయ్ కుమార్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్, పార్లమెంటు సభ్యుడు శ్రీ సంజయ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. నేపథ్యం బీహార్ రాష్ట్రం , పొరుగు దేశమైన నేపాల్ లో స్వచ్ఛమైన వంట ఇంధనానికి ప్రాప్యతను అందించే 109 కిలోమీటర్ల పొడవైన ఇండియన్ ఆయిల్ ముజఫర్ పూర్ – మోతీహరి ఎల్ పిజి
పైప్ లైన్ ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. మోతీహారి వద్ద ఇండియన్ ఆయిల్ ఎల్ పి జి బాట్లింగ్ ప్లాంటు , స్టోరేజ్ టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు. కొత్త పైప్ లైన్ టెర్మినల్ నేపాల్ కు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి వ్యూహాత్మక సరఫరా కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఉత్తర బిహార్ లోని తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, గోపాల్ గంజ్, సివాన్, ముజఫర్ పూర్, షియోహార్, సీతామర్హి, మధుబని జిల్లాలకు ఇది సేవలు
అందిస్తుంది. మోతిహరి వద్ద కొత్త బాట్లింగ్ ప్లాంట్ మోతీహరి ప్లాంట్ కు అనుబంధంగా ఉన్న ఫీడింగ్ మార్కెట్లలో సరఫరా గొలుసును సులభతరం చేస్తుంది. తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, గోపాల్ గంజ్, సివాన్, దోరియాలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ , హెచ్ బి ఎల్ సుగౌలి , లౌరియా వద్ద ధాన్యం ఆధారిత
ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్ హెచ్ 28 ఎ లో పిప్రకోఠి – మోతిహరి – రక్సౌల్ సెక్షన్ రెండు లేన్లు, ఎన్ హెచ్ – 104లోని షియోహర్-సీతామర్హి-సెక్షన్ రెండు లేన్ల రోడ్డు ప్రాజెక్టు లను
ప్రధానమంత్రి ప్రారంభించారు. గంగా నదిపై పాట్నా వద్ద దిఘా-సోనేపూర్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జికి సమాంతరంగా గంగానదిపై ఆరు వరుసల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం సహా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఎన్ హెచ్ -19 బైపాస్ లోని బకర్ పూర్ హట్ – మాణిక్ పూర్ సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చే ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు.
ప్రధాన మంత్రి వివిధ రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. బాపుధామ్ మోతీహారి – పిప్రహాన్, నర్కతియాగంజ్-గౌహతి మధ్య 62 కిలోమీటర్ల రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. 96 కిలోమీటర్ల పొడవైన గోరఖ్ పూర్ కంటోన్మెంట్ – వాల్మీకి నగర్ రైలు మార్గం డబ్లింగ్ , విద్యుదీకరణ , బేతియా రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. నార్కటియాగంజ్ – గౌనహా, రక్సౌల్ – జోగ్బానీ మధ్య రెండు కొత్త రైలు సర్వీసులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
डबल इंजन की सरकार में बिहार अपने पुराने गौरव को हासिल करने की राह पर तेजी से अग्रसर है। बेतिया में विकसित भारत, विकसित बिहार कार्यक्रम को संबोधित कर रहा हूं।https://t.co/ldWRkdX65d
— Narendra Modi (@narendramodi) March 6, 2024
विकसित भारत के लिए, बिहार का विकसित होना भी उतना ही जरूरी है। pic.twitter.com/n6QurKk9cw
— PMO India (@PMOIndia) March 6, 2024
मेरे लिए तो पूरा भारत ही मेरा घर है, हर भारतवासी ही मेरा परिवार है: PM @narendramodi pic.twitter.com/A02NXHhEC4
— PMO India (@PMOIndia) March 6, 2024
***
DS/TS/AK
डबल इंजन की सरकार में बिहार अपने पुराने गौरव को हासिल करने की राह पर तेजी से अग्रसर है। बेतिया में विकसित भारत, विकसित बिहार कार्यक्रम को संबोधित कर रहा हूं।https://t.co/ldWRkdX65d
— Narendra Modi (@narendramodi) March 6, 2024
विकसित भारत के लिए, बिहार का विकसित होना भी उतना ही जरूरी है। pic.twitter.com/n6QurKk9cw
— PMO India (@PMOIndia) March 6, 2024
मेरे लिए तो पूरा भारत ही मेरा घर है, हर भारतवासी ही मेरा परिवार है: PM @narendramodi pic.twitter.com/A02NXHhEC4
— PMO India (@PMOIndia) March 6, 2024