Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిహార్ ముఖ్యమంత్రి గా శ్రీ నీతీశ్ కుమార్ పదవీస్వీకార ప్రమాణంచేసిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


బిహార్ ముఖ్యమంత్రి గా శ్రీ నీతీశ్ కుమార్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు గా శ్రీ సమ్రాట్ చౌధరి మరియు శ్రీ విజయ్ సిన్హా లు పదవీస్వీకార ప్రమాణం చేసిన సందర్భం లో వారికి కూడా అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

బిహార్ లో ఏర్పాటైన ఎన్ డిఎ ప్రభుత్వం రాష్ట్రం యొక్క అభివృద్ధి లో మరియు ఇక్కడి ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం సర్వశక్తుల ను ఒడ్డుతుంది.

ముఖ్యమంత్రి గా నీతీశ్ కుమార్ గారు మరియు ఉప ముఖ్యమంత్రులు గా సమ్రాట్ చౌధరి గారు , ఇంకా విజయ్ సిన్హా గారు లు పదవీప్రమాణాన్ని స్వీకారించిన సందర్భం లో వారికి ఇవే నా అనేకానేక అభినందన లు.

ఈ జట్టు పూర్తి సమర్పణ భావం తో రాష్ట్రం లోని నా కుటుంబ సభ్యుల కు సేవ చేయగలదన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS