13 నూతన కేంద్రీయ విశ్వవిద్యాలయాల కు పునరావృత్త వ్యయం తో పాటు కేంపస్ లలో అవసరమైన మౌలిక సదుపాయాల ను ఏర్పాటు చేయడం కోసం 3,639.32 కోట్ల రూపాయల ను ఖర్చు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పనులు 36 నెలల లోపల పూర్తి కానున్నాయి.
ఈ కేంద్రీయ విశ్విద్యాలయాల కు మంత్రివర్గం ఇంతకు ముందు 3,000 కోట్ల రూపాయల కు ఆమోదం తెలియజేయగా ఆ మొత్తాని కి అదనం గా ఖర్చయిన 1,474.65 కోట్ల రూపాయల కు కూడా మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదముద్ర వేసింది.
కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలను బిహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము & కశ్మీర్ (రెండు), ఝార్‌ఖండ్, కర్నాటక, కేరళ, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళ నాడు రాష్ట్రాల లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం, 2009 ప్రకారం స్థాపించడమైంది. వాటిలో-
బిహార్ లోని గయ లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్;
మహేందర్ గఢ్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హరియాణా;
జమ్ము లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్ము;
రాంచీ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ ఖండ్;
శ్రీనగర్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్;
గుల్బర్గా లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక;
కాసర్‌గోడ్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ;
కోరాపుట్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా;
బఠిండా లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్;
రాజస్థాన్ లోని బందర్ సింద్ రీ లో గల సెంట్రల్ యూనివర్సిటీ రాజస్థాన్;
తిరువరూర్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళ నాడు;
గుజరాత్ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ లతో పాటు
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్
-ఉన్నాయి.
ప్రభావం:
ఇది ఉన్నత విద్య అవకాశాలను పెంచుతుంది. అంతేకాకుండా ఇతర విశ్వవిద్యాలయాలు అనుకరించదగిన మార్గదర్శక ప్రమాణాల ను కూడా నెలకొల్పనుంది. విద్య సంబంధ సదుపాయాల లో ప్రాంతీయ అసమానతల ను తగ్గించడం లో కూడా ఇది సహాయకారి కానుంది.
**