Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిమ్స్ టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారుతో సమావేశమైన ప్రధానమంత్రి


బ్యాంకాక్ లో ఏర్పాటైన బిమ్స్ టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు.

ప్రజాస్వామ్యబద్ధమైనసుస్థిరశాంతియుతప్రగతిశీలసమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రెండు దేశాల సంబంధాల విషయమై భారతదేశం ప్రజలకేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తోందనిరెండు దేశాల మధ్య సహకారం ప్రజలకు గట్టి ప్రయోజనాలను సమకూర్చిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఆచరణ సాధ్యమయ్యే మేర బంగ్లాదేశ్‌తో సానుకూలనిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని భారత్ భావిస్తోందని ప్రధాని చెప్పారు.  

వాతావరణాన్ని కలుషితం చేసే ప్రకటనలు చేయకపోవడమే ఉత్తమమని ప్రధాని సూచించారుసరిహద్దుల వద్ద భద్రతనుఅనుకూల పరిస్థితులను కాపాడేందుకు అక్రమ చొరబాట్లను – ముఖ్యంగా రాత్రి సమయాల్లో– నిరోధించాలనిఇందుకు గానూ సంబంధిత చట్టాలను తప్పకుండా అమలు చేయాలని శ్రీ మోదీ సూచించారు.  ఇరుదేశాల సంబంధాలను సమీక్షించేందుకుబలోపేతం చేసేందుకు తగిన ద్వైపాక్షిక వ్యవస్థలు సమావేశమై కార్యాచరణను ప్రారంభించవచ్చని అన్నారు.

బంగ్లాదేశ్ లో  హిందువులుఇతర మైనారిటీల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానివారి పట్ల అకృత్యాలకు పాల్పడ్డవారిని విచారించడం సహా ప్రభుత్వం తగు చర్యల తీసుకుని మైనారిటీల భద్రతకు భరోసా కల్పించగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
బిమ్స్ టెక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో అభినందనలు తెలియజేసిన శ్రీ మోదీబంగ్లాదేశ్ నేతృత్వంలో కూటమి లక్ష్యమైన ప్రాంతీయ సహకారం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారుప్రాంతీయ సమగ్రత పెంపొందించేందుకు బిమ్స్ టెక్ పరిధిలోనే కాకద్వైపాక్షిక చర్చలుసహకారాలను ముమ్మరం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు.  

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న పరస్పర ప్రయోజనకర సంబంధాలను కొనసాగించే దిశగా ఉమ్మడి ఆసక్తి గల అన్ని అంశాల గురించి చర్చలు కొనసాగగలవనిపరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోగలమన్న ఆశాభావాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.

 

***