Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సు.. నేపాల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ


బిమ్స్‌టెక్ 6వ శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
భారత్, నేపాల్‌ల మధ్య ఉన్న విశిష్ట, సన్నిహిత సంబంధాలను నేతలిద్దరూ సమీక్షించారు. వారు భౌతిక, డిజిటల్ రంగాల్లో సంధానాన్ని, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర అనుబంధాన్ని, ఇంధన రంగ సహకారాన్ని పెంచడంలో పురోగతిని గమనించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉభయ దేశాల మధ్య, ప్రజల మధ్య అనేక విధాలైన భాగస్వామ్యాన్ని ఇప్పటికన్నా విస్తరించుకొనే దిశగా కృషిని కొనసాగిద్దామంటూ వారు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

భారత్ అనుసరిస్తున్న ‘పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం’ విధానంలో భాగంగా, నేపాల్ ప్రాథమ్య భాగస్వాముల్లో ఒకటిగా ఉంది. ఉభయ దేశాల మధ్య క్రమం తప్పక ఉన్నత స్థాయి సంభాషణలు నిర్వహిస్తూ వస్తున్న సంప్రదాయానికి కొనసాగింపే ఈ సమావేశం.