Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిఎస్ఎన్ఎల్, ఇంకా ఎంటిఎన్ఎల్ ల పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌ణాళిక కు మ‌రియు ఈ రెండు సంస్థ ల సూత్ర‌ప్రాయ విలీనాని కి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండ‌లి


 

4జి తాలూకు స్పెక్ట్ర‌మ్ ను టెలికం పిఎస్ఇ ల‌కు కేటాయిస్తారు

20,000 కోట్ల రూపాయ‌ల కు పైగా మూల‌ధ‌న నిధుల ను అందిస్తారు

15,000 కోట్ల రూపాయ‌ల దీర్ఘకాలిక బాండ్ ల‌కు సార్వ‌భౌమ పూచీక‌త్తు

ఆక‌ర్ష‌ణీయంగా ఉండే విఆర్ఎస్ వ్య‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంది

 

 

బిఎస్ఎన్ఎల్ మ‌రియు ఎంటిఎన్ఎల్ ల పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌ కు కేంద్ర మంత్రి మండ‌లి ఈ రోజు న ఆమోదం తెలిపింది. దీని కోసం 4జి సేవ‌ ల తాలూకు స్పెక్ట్ర‌మ్ ను ప‌రిపాల‌న ప‌రంగా కేటాయించ‌డం, సార్వ‌భౌమ పూచీక‌త్తు తో కూడిన బాండ్ ల రూపేణా నిధుల ను స‌మీక‌రించి రుణ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌ర‌ప‌డం, ఉద్యోగి సంబంధ వ్య‌యాల ను త‌గ్గించ‌డం, ఆస్తుల ను విక్ర‌యించి న‌గ‌దు గా మార్చ‌డమే కాకుండా బిఎస్ఎన్ఎల్ మ‌రియు ఎంటిఎన్ఎల్ విలీనాని కి మంత్రిమండలి సూత్ర‌ప్రాయ ఆమోదాన్ని తెలిపింది.

ఈ కింద పేర్కొన్న అంశాల కు మంత్రివ‌ర్గం ఆమోదాన్ని తెలియ‌జేసింది:-

1.  బిఎస్ఎన్ఎల్ కు మ‌రియు ఎంటిఎన్ఎల్ కు 4జి సేవ‌ల కై స్పెక్ట్ర‌మ్ ను ప‌రిపాల‌న పూర్వ‌కం గా కేటాయించ‌డం జ‌రుగుతుంది. త‌ద్వారా ఈ పిఎస్‌యు లు బ్రాడ్ బ్యాండ్, ఇంకా ఇత‌ర డేటా సంబంధ సేవ‌ల ను అంద‌జేసేందుకు వీల‌వుతుంది. ప్ర‌స్తావిత స్పెక్ట్ర‌మ్ కు నిధుల ను భార‌త ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుతుంది. ఇందుకు గాను, ఈ పిఎస్‌యు లకు అద‌నం గా 20,140 కోట్ల రూపాయ‌ల మేర‌కు మూలధ‌న నిధుల ను అందించ‌డం జ‌రుగుతుంది. ఈ స్పెక్ట్ర‌మ్ విలువ కు 3,674 కోట్ల రూపాయ‌ల జిఎస్‌టి మొత్తాన్ని కూడా భార‌త ప్ర‌భుత్వం బ‌డ్జెట్ సంబంధిత వ‌న‌రుల నుండి తానే భ‌రించ‌నుంది. ఈ స్పెక్ట్ర‌మ్ కేటాయింపు ను ఉప‌యోగించ‌డం ద్వారా బిఎస్ఎన్ఎల్ మ‌రియు ఎంటిఎన్ఎల్ 4జి సేవ‌ల ను అందించ‌గ‌ల‌డం తో పాటు విప‌ణి లో పోటీ ప‌డేట‌టువంటి సామ‌ర్ధ్యాన్ని కూడా సంత‌రించుకొంటాయి. అంతేకాక‌, గ్రామీణ ప్రాంతాల తో పాటు వాటికి ఉన్న విస్తృత‌మైన నెట్‌వ‌ర్క్ అండ‌ తో హై స్పీడ్ డేటా ను కూడా అందించ‌గ‌లుగుతాయి.

2. బిఎస్ఎన్ఎల్ కు మ‌రియు ఎంటిఎన్ఎల్ 15,000 కోట్ల రూపాయ‌ల మేర‌కు దీర్ఘ‌కాలిక బాండ్ ల‌ను కూడా విడుద‌ల చేస్తాయి. ఈ బాండ్ ల‌కు సార్వ‌భౌమ పూచీక‌త్తు ను భార‌త ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుతుంది. ప్ర‌స్తావిత వ‌న‌రుల తో బిఎస్ఎన్ఎల్ మ‌రియు ఎంటిఎన్ఎల్ వాటి ప్ర‌స్తుత రుణాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించుకొంటాయి. దీనికి తోడు మూల‌ధ‌న సంబంధిత వ్య‌యాల ను (సిఎపిఇఎక్స్), నిర్వ‌హ‌ణ సంబంధిత వ్య‌యాల ను (ఒపిఇఎక్స్) మ‌రియు ఇత‌ర అవ‌స‌రాల ను కూడా పాక్షికం గా తీర్చుకొంటాయి.

 

3. బిఎస్ఎన్ఎల్ మ‌రియు ఎంటిఎన్ఎల్ వాటి యొక్క ఉద్యోగుల లో 50 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు మ‌రియు అంత‌కు పైబ‌డిన వ‌య‌స్సు క‌లిగిన ఉద్యోగుల కు ఆక‌ర్ష‌ణీయ‌మైన‌టువంటి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ (విఆర్ఎస్‌) ప‌థ‌కాన్ని సైతం ఇవ్వ‌జూపుతాయి. ప‌థ‌కాని కి అయ్యే వ్య‌యాన్ని భార‌త ప్ర‌భుత్వం బ‌డ్జెట్ నుండి కేటాయించే మొత్తం తో భ‌రించ‌డం జ‌రుగుతుంది. విఆర్ఎస్ యొక్క అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపు భాగాని కై 17,169 కోట్ల రూపాయ‌లు అద‌నం గా అవ‌స‌ర‌మ‌వుతాయి. పెన్శన్ కు, గ్రాట్యుటీ కి మ‌రియు క‌మ్యుటేశ‌న్ కు అయ్యే వ్య‌యాన్ని భార‌త ప్ర‌భుత్వం భ‌రిస్తుంది.   ప‌థ‌కం యొక్క వివ‌రాల‌ కు బిఎస్ఎన్ఎల్ /ఎంటిఎన్ఎల్ ద్వారా తుది రూపాన్ని ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

4. బిఎస్ఎన్ఎల్ మ‌రియు ఎంటిఎన్ఎల్ వాటి ఆస్తుల ను విక్ర‌యించి న‌గ‌దు రూపం లోకి మార్చుకొంటాయి. అలా స‌మ‌కూరే మొత్తం తో రుణ భారాన్ని తీర్చుకోవ‌డం, బాండ్ ల‌ను తిరిగి చెల్లించ‌డం, నెట్ వ‌ర్క్ స్థాయి ని పెంపొందించుకోవ‌డం, నెట్ వ‌ర్క్ ను విస్త‌రించుకోవ‌డం తో పాటు నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన అవ‌స‌రాల కు వినియోగించుకోవ‌డం చేస్తాయి.

5. బిఎస్ఎన్ఎల్ కు మ‌రియు ఎంటిఎన్ఎల్ యొక్క సూత్ర‌ప్రాయ విలీనం

పైన పేర్కొన్న పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌ణాళిక ను ఆచ‌ర‌ణ లోకి తీసుకొని రావ‌డం వ‌ల్ల బిఎస్ఎన్ఎల్ మ‌రియు ఎంటిఎన్ఎల్ వాటి కి గ్రామీణ మరియు సుదూర ప్రాంతాలు సహా దేశ‌వ్యాప్తం గా ఉన్న‌టువంటి ప‌టిష్ట‌మైన టెలి క‌మ్యూనికేశ‌న్ నెట్ వ‌ర్క్ ద్వారా ఆధార‌ ప‌డ‌ద‌గిన‌టువంటి మ‌రియు నాణ్య‌త క‌లిగిన‌టువంటి సేవ‌ల ను అంద‌జేయ‌గ‌లుగుతాయి.