Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న క్రమం లో ఇటలీ ప్రధాని తోసమావేశమైన ప్రధాన మంత్రి 


బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుతున్న క్రమం లో ఇటలీ ప్రధాని జియార్జియా మెలోనీ గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.

ఇటలీ కి ఒకటో మహిళా ప్రధాని గా మెలోనీ గారు ఎన్నికైనందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలియ జేశారు. ఇద్దరు నేత లు వ్యాపారం మరియు పెట్టుబడి, ఉగ్రవాదానికి వ్యతిరేకం గా పోరాటం మరియు ప్రజల మధ్య మేలుకలయిక సహా వివిధ రంగాల లో ద్వైపాక్షిక సంబంధాల ను గాఢతరం గా తీర్చిదిద్దే అంశాన్ని గురించి చర్చించారు.

ఉభయ నేత లు పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాలపైన మరియు ప్రపంచ స్థాయి అంశాల పైన వారి వారి అభిప్రాయాల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు.

భారతదేశం-ఇటలీ దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొనే ఘట్టాన్ని ఉత్సవం వలె జరుపుకొంటామన్న ఆశ ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఆయన ప్రధాని మెలోనీ గారి ని తదుపరి జి-20 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం రాబోయే సంవత్సరం లో భారతదేశాని కి విచ్చేయవలసిందంటూ ఆహ్వానించారు కూడాను.

 

***