Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ఆస్ట్రేలియా ప్రధాని తోసమావేశమైన ప్రధాన మంత్రి


జి-20 శిఖర సమ్మేళనం బాలి లో జరుగుతున్న క్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథనీ అల్బనీజ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం లో భాగం గా ఉభయ దేశాల మధ్య సంబంధాలు ఉత్కృష్ట స్థితి లో కొనసాగుతున్నందుకు మరియు భారతదేశాని కి, ఆస్ట్రేలియా కు మధ్య ఉన్నత స్థాయి సంభాషణ లు క్రమం తప్పక చోటు చేసుకొంటూ ఉన్నందుకు ఇరువురు నేత లు సంతృప్తి ని వ్యక్తం చేశారు. రక్షణ, వ్యాపారం, విద్య, స్వచ్ఛ శక్తి మరియు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా వివిధ రంగాల లో సహకారాన్ని గాఢతరం గా తీర్చిదిద్దడం లో నమోదు అయిన ప్రగతి ని గురించి వారు సమీక్ష జరిపారు. విద్య రంగం లో, ప్రత్యేకించి ఉన్నత విద్య, వృత్తి విద్య మరియు సామర్థ్యాల నిర్మాణం రంగాల లో సంస్థాగత భాగస్వామ్యం పై సమగ్రం గా చర్చించడమైంది.

పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాల పైన మరియు ప్రపంచ స్థాయి అంశాల పైన నేత లు వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు. ఆ అంశాల లో ఒక స్థిరమైనటువంటి మరియు శాంతిపూర్ణమైనటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్, జలవాయ సంబంధి వ్యవహారాలు, ఇంకా జి-20 కూటమి కి భారతదేశం అధ్యక్షత వహించనుండటానికి సంబంధించి వారి యొక్క ఉమ్మడి దృష్టికోణం భాగం గా ఉన్నాయి.
ప్రధాని శ్రీ అల్బనీజ్ కు వీలైనంత త్వరలో భారతదేశం లో స్వాగతం పలకాలని ప్రధాన మంత్రి ఆశపడుతున్నారు.

 

**