Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాలి లోజి-20 శిఖర సమ్మేళనం జరుగుతూ ఉన్న సందర్భం లో మడ అడవుల ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

బాలి లోజి-20 శిఖర సమ్మేళనం జరుగుతూ ఉన్న సందర్భం లో మడ అడవుల ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


బాలి లో ఈ రోజు న జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న క్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జి-20 సభ్యత్వ దేశాల కు చెందిన ఇతర నేతల తో కలసి ‘తమన్ హటన్ రాయా నగురాహ్ రాయ్’ మడ అడవుల ను సందర్శించి, అక్కడ మొక్కల ను నాటారు.

మడ అడవులు ప్రపంచ సంరక్షణ ప్రయాసల లో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తూ వస్తున్నాయి. జి-20 కూటమి కి ఇండొనేశియా అధ్యక్షత వహిస్తున్న కాలం లో, ఇండొనేశియా మరియు యుఎఇ ల సంయుక్త కార్యక్రమం అయినటువంటి మేన్ గ్రోవ్ అలాయన్స్ ఫార్ క్లైమేట్ (ఎమ్ఎసి) లో బారతదేశం చేరిపోయింది.

భారతదేశం లో 50 కి పైగా మడ అడవుల లో పెరిగే మొక్కల రకాల ను 5000 చదరపు కిలో మీటర్ లకు పైగా విస్తరించిన ప్రాంతాల లో చూడవచ్చును. మడ అడవుల ను సంరక్షించడం మరియు వాటిని పునరుద్ధరించడం పై భారతదేశం శ్రద్ధ ను తీసుకొంటున్నది. ఈ కోవ కు చెందిన అడవులు జీవ వైవిధ్యం తాలూకు సమృద్ధ స్థలాలు గా ఉండటం తో పాటు ప్రభావ శీల కార్బన్ సింకు ల వలె కూడా పనిచేస్తున్నాయి.

 

 

**