Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాబూ జగ్ జీవన్ రామ్ జయంతి నాడు ఆయ‌న‌ను స్మ‌రించిన‌ ప్ర‌ధాన మంత్రి


బాబూ జగ్ జీవన్ రామ్ గారి జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు ప్రణమిల్లారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ‘‘స్వ‌యంకృషి తో ఎదిగిన శ్ర‌మ‌శీలి బాబు జ‌గ్ జీవ‌న్ రామ్ గారి తోడ్పాటును ఎన్న‌టికీ మ‌రచిపోలేం. ఒక స్వాతంత్య్ర యోధునిగా మ‌రియు చిర‌కాల అనుభ‌వం క‌లిగిన ప‌రిపాల‌కునిగా భార‌త‌దేశానికి ఆయ‌న అందించిన సేవ‌లు దోష‌ర‌హిత‌మైన‌వి. బాబూజీ ఒక నిజ‌మైన ప్ర‌జాస్వామికుడు. ఆయ‌న ఎలాంటి అధికార‌తావాదానికి త‌లొగ్గ లేదు. ఆయ‌న జ‌యంతి రోజు న భార‌త‌దేశం బాబూ జ‌గ్ జీవ‌న్ రామ్ గారిని గుర్తుకు తెచ్చుకొంటోంది’’ అని త‌న సందేశంలో పేర్కొన్నారు.