Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్‌ యూనివర్సిటీ 6వ స్నాతకోత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి

బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్‌ యూనివర్సిటీ 6వ స్నాతకోత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి

బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్‌ యూనివర్సిటీ 6వ స్నాతకోత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లక్నోలో జరిగిన బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్‌ యూనివర్సిటీ 6వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ,
యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న, యువోత్సాహం ఉరకలు వేస్తున్న భార‌త దేశం 21వ శ‌తాబ్దంలో సాధిస్తున్న పురోగతిని చూస్తుంటే ఒక పక్క తనకెంతో ఆనందంగా ఉందన్నారు. యువ శక్తే భారత బలానికి మూలం అని ఆయన చెప్పారు.
మరో పక్క, ఇటీవల హైద‌రాబాద్ లో ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య ఉదంతాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొంటూ, ఆ విద్యార్థి కుటుంబానికి కలిగిన వేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. కారణాలు ఏవైనప్పటికీ, ఒక తల్లి తన కుమారుడిని కోల్పోయిందని, నిజానికి భ‌ర‌త మాత ఒక బిడ్డను కోల్పోయినట్లు చెప్పాల్పి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్క‌ర్ చూపిన మార్గంలో తన ప్ర‌భుత్వం న‌డుస్తుంద‌ని ప్రధాన మంత్రి అన్నారు. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేలా త‌గిన వాతావ‌రణాన్ని రూపొందించడానికి కృషి చేస్తుంద‌ని తెలిపారు.

డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ఆర్థిక దృక్ప‌థాన్ని ప్రధాన మంత్రి జ్ఞాప‌కం చేసుకొంటూ, యువతను ఉద్యోగాలు కోరుకొనే వారిగా కన్నా ఉద్యోగాలు కల్పించే వారుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

డాక్టర్ అంబేద్కర్ విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చారని, జీవితంలో అనేక ఇక్క‌ట్లు ఎదురైనప్పటికీ ఎంతో సాధించార‌ని ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. దేశంలోని బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి ఆయ‌న పాటు ప‌డేందుకు విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చార‌ని వివ‌రించారు. చదువు పూర్తి చేసుకున్న యువ‌తీయువకులు అంబేద్క‌ర్ వేసిన బాటలో సాగాల‌ని, పేదల, అణ‌గారిన వ‌ర్గాల సేవకు పాటు ప‌డాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

విశ్వవిద్యాలయంలో అత్యంత ఆధునిక విద్యార్థి కార్యకలాపాల కేంద్రం నిర్మాణానికి ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేశారు.