Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాడ్ మింటన్ పురుషుల డబల్స్ పోటీ లోబంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కి మరియుశ్రీ చిరాగ్ శెట్టి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి


బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ పురుషుల డబల్స్ పోటీ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కి మరియు శ్రీ చిరాగ్ శెట్టి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘భారతదేశం యొక్క బాడ్ మింటన్ దళం సాఫల్యాన్ని మరియు ఉత్కృష్టత ను పునర్ నిర్వచించింది. శ్రీ @satwiksairaj మరియు శ్రీ @Shettychirag04 లు గొప్ప టీమ్ వర్క్ ను మరియ గొప్ప నైపుణ్యాల ను కనబరిచారు. స్వర్ణ పతకాన్ని స్వదేశానికి తీసుకు వస్తున్నందుకు వారి ని చూస్తే గర్వం గా ఉంది. వారు రాబోయే కాలాల్లోనూ భారతదేశానికి మరిన్ని పురస్కారాల ను గెలుస్తూ ఉందురు గాక. #Cheer4India’’ అని పేర్కొన్నారు.