Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బహిష్కారం నుండిఅవకాశాల వైపు..: వికసిత్ భారత్ యొక్క బాట లో మునుముందుకు


అంత్యోదయ సిద్ధాంతం నుండి ప్రేరణ ను పొంది, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ పేదల కు సేవ చేయడం మరియు సమాజం లో ఆదరణ కు నోచుకోని సముదాయాల ను సాధికార పరచడాన్ని గట్టి గా సమర్ధిస్తూ వస్తున్నారు. సామాజిక ఏకీకరణ మరియు అభివృద్ధి లతో కూడినటువంటి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క ప్రగతిశీల దృష్టికోణం గత తొమ్మిది సంవత్సరాల లో ప్రభుత్వం ప్రారంభించినటువంటి చారిత్రిక విధానాల కు మరియు కార్యక్రమా లకు చోదక శక్తి గా ఉంటూ వచ్చింది.

ప్రధాన మంత్రి యొక్క వెబ్ సైట్ లో ప్రచురించిన ఒక వ్యాసాని కి సంబంధించిన లింకు ను పిఎమ్ఒ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో,

‘‘ఆదరణ కు నోచుకోని సముదాయాల కు సమానావకాశాల ను అందించడం ద్వారా సామాజికం గా అన్ని వర్గాల ప్రజల ను కలుపుకొని పోయేటటువంటి దేశాన్ని నిర్మించడం జరుగుతోంది.’’ అని పేర్కొంది.