Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి నివాళి


   నేడు బసవ జయంతి పర్వదినం నేపథ్యంలో జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా 2020లో జ‌గ‌ద్గురు బ‌స‌వేశ్వ‌ర గురించి తాను చేసిన ప్రసంగాన్ని కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   ‘‘ప‌విత్ర బ‌స‌వ జ‌యంతి సంద‌ర్భంగా జ‌గ‌ద్గురు బ‌స‌వేశ్వ‌ర‌కు నివాళి అర్పిస్తున్నాను. ఆయ‌న ఆద‌ర్శాలు, ప్ర‌బోధాలు ప్రపంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌కు ఎంతో శ‌క్తిని, స్ఫూర్తిని ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నేను 2020లో జ‌గ‌ద్గురు బ‌స‌వేశ్వ‌ర గురించి చేసిన ప్ర‌సంగాన్ని మీతో పంచుకుంటున్నాను’’ అని ప్ర‌ధామంత్రి పేర్కొన్నారు.”