Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బంగారు పతకాన్ని గెలిచిన బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ నీతేశ్ కుమార్ కు ప్రధాన మంత్రి అభినందనలు


ఫ్రాన్స్ లో పారాలింపిక్స్ లో పురుషుల పారా బాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 పోటీలో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ నీతేశ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం  అభినందించారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు :

‘‘శ్రీ నీతేశ్ కుమార్ మహత్తర కార్యాన్ని సాధించారు..  పారా బాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3 ఈవెంట్ లో పసిడి పతకాన్ని ఆయన గెలుచుకొన్నారు.  ఆశ్చర్యకరమైన ప్రావీణ్యాలకు, నిరంతర శ్రమకు ఆయన పెట్టింది పేరు.  భావి క్రీడాకారులకు ఇలాగే ప్రేరణను ఆయన అందిస్తూ ఉండాలని నేను కోరుకొంటున్నాను.

శ్రీ నీతేశ్ కుమార్, చీర్ ఫర్ భారత్ (@niteshnk11 #Cheer4Bharat).’’