ప్రధాని నరేంద్రమోదీ రేస్‌కోర్స్ రోడ్డు నంబర్ 7లో జరిగిన ఒక కార్యక్రమంలోమూడు బంగారం పథకాలను ప్రారంభించారు. అవి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, సావెరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్, ఇండియా గోల్డ్ కాయిన్స్. మన సంపదకు విలువ జోడింపుగా ఆయన ఈ పథకాలను అభివర్ణించారు.
20 వేల టన్నుల బంగారం ఉన్న భారత్‌ను ఒక పేదదేశంగా వర్గీకరించడం తగదని ప్రధాని అన్నారు. అయితే అందుబాటులో ఉన్న ఆ బంగారాన్ని ఉత్పాదకంగా మార్చాల్సిన అవసరం ఉన్నదని, ఈ స్కీమ్‌లు మనని ఆ లక్ష్యానికి చేరువ చేస్తాయని ఆయన అన్నారు.
భారత సమాజంలో బంగారం మహిళల సాధికారతకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లు ఆ సాధికారతను మరింత శక్తివంతం చేయనున్నట్టు చెప్పారు.
భారత్‌లో స్వర్ణకారుల పట్ల కుటుంబ వ్యవస్థలో ఎనలేని విశ్వాసం ఉంటుందని ప్రధాని అన్నారు. స్వర్ణకారులు ఈ పథకాలను అవగాహన చేసుకోగలిగితే వారే ఈ స్కీమ్‌లను ముందుకు నడిపే ప్రతినిధులుగా నిలుస్తారని ఆయన చెప్పారు.
అశోక చక్రంతో ఇండియా బంగారు నాణెలను విడుదల చేయడం జాతి యావత్తుకు గర్వకారణమని ప్రధాని వ్యాఖ్యానించారు. భారత ప్రజలు ఇంక ఏ మాత్రం విదేశాల్లో ముద్రించిన బంగారు నాణాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ పథకాల వివరాలతో కూడిన వెబ్‌సైట్‌ను ప్రధాని ఆవిష్కరించారు. తొలి ఆరుగురు ఇన్వెస్టర్లకు ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్లు అందచేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య శాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
PM speaking at launch of gold related schemes. https://t.co/jfSqKXJ1dp
— PMO India (@PMOIndia) November 5, 2015
The reason behind the success of these schemes will be the women of India: PM @narendramodi https://t.co/jfSqKXJ1dp
— PMO India (@PMOIndia) November 5, 2015
A golden day…the launch of 3 gold related schemes. Know more about these schemes on this website. https://t.co/CFOWQa2f04
— Narendra Modi (@narendramodi) November 5, 2015
Spoke on how gold schemes will contribute to women empowerment & need to integrate goldsmiths in these schemes. https://t.co/qabsZ4AsnP
— NarendraModi(@narendramodi) November 5, 2015
A moment of pride… launch of India Gold Coins, bearing the Ashok Chakra. pic.twitter.com/vlY9bErzaU
— NarendraModi(@narendramodi) November 5, 2015