Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బంగారం ప‌థ‌కాలు ప్రారంభించిన అనంత‌రం ప్ర‌ధాని వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేస్‌కోర్స్ రోడ్డు నంబ‌ర్ 7లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలోమూడు బంగారం ప‌థ‌కాల‌ను ప్రారంభించారు. అవి గోల్డ్ మానిటైజేష‌న్ స్కీమ్‌, సావెరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌, ఇండియా గోల్డ్ కాయిన్స్. మ‌న సంప‌ద‌కు విలువ జోడింపుగా ఆయ‌న ఈ ప‌థ‌కాల‌ను అభివ‌ర్ణించారు.

20 వేల ట‌న్నుల బంగారం ఉన్న భార‌త్‌ను ఒక పేద‌దేశంగా వ‌ర్గీక‌రించ‌డం త‌గ‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. అయితే అందుబాటులో ఉన్న ఆ బంగారాన్ని ఉత్పాద‌కంగా మార్చాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని, ఈ స్కీమ్‌లు మ‌న‌ని ఆ ల‌క్ష్యానికి చేరువ చేస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

భార‌త స‌మాజంలో బంగారం మ‌హిళ‌ల సాధికార‌త‌కు ప్ర‌తీక అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లు ఆ సాధికార‌త‌ను మ‌రింత శ‌క్తివంతం చేయ‌నున్న‌ట్టు చెప్పారు.

భార‌త్‌లో స్వ‌ర్ణ‌కారుల ప‌ట్ల‌ కుటుంబ వ్య‌వ‌స్థ‌లో ఎన‌లేని విశ్వాసం ఉంటుంద‌ని ప్ర‌ధాని అన్నారు. స్వ‌ర్ణ‌కారులు ఈ ప‌థ‌కాల‌ను అవ‌గాహ‌న చేసుకోగ‌లిగితే వారే ఈ స్కీమ్‌ల‌ను ముందుకు న‌డిపే ప్ర‌తినిధులుగా నిలుస్తార‌ని ఆయ‌న చెప్పారు.

అశోక చ‌క్రంతో ఇండియా బంగారు నాణెల‌ను విడుద‌ల చేయ‌డం జాతి యావ‌త్తుకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. భార‌త ప్ర‌జ‌లు ఇంక ఏ మాత్రం విదేశాల్లో ముద్రించిన బంగారు నాణాల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ ప‌థ‌కాల వివ‌రాల‌తో కూడిన వెబ్‌సైట్‌ను ప్ర‌ధాని ఆవిష్క‌రించారు. తొలి ఆరుగురు ఇన్వెస్ట‌ర్ల‌కు ఇన్వెస్ట్‌మెంట్ స‌ర్టిఫికెట్లు అంద‌చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య శాఖ స‌హాయ‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, ఆర్థిక శాఖ స‌హాయ‌మంత్రి జ‌యంత్ సిన్హా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.