Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బంగబంధు శేఖ్ ముజీబుర్ ర‌హ‌మాన్ యొక్క 100వ‌ జ‌యంతి సమారోహం సంద‌ర్భం లో బాంగ్లాదేశ్ కు వీడియో మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన సందేశం


న‌మ‌స్కార‌ం.

‘జాతిర్ పిత’, బంగబంధు శేఖ్ ముజీబుర్ ర‌హ‌మాన్ శ‌త జ‌యంతి సంద‌ర్భం లో యావ‌త్తు బాంగ్లాదేశ్ ప్ర‌జ‌ల కు 130 కోట్ల మంది భార‌తీయ సోద‌రీమ‌ణుల మ‌రియు భారతీయ సోద‌రుల ప‌క్షాన అనేకానేక అభినందనలు, శుభాకాంక్ష‌లూ ను.

మిత్రులారా,

ఈ చారిత్రిక ఘ‌ట్టం లో పాలుపంచుకోవలసిందంటూ శేఖ్ హ‌సీనా గారు స్వ‌యం గా నన్ను ఆహ్వానించారు.  అయినప్పటికిని, క‌రోనా వైర‌స్ కార‌ణం గా కావచ్చును, అది సాధ్యపడలేదు.  ఆ త‌రువాత, శేఖ్ హ‌సీనా గారు త‌నంత‌ట తాను ఒక ఐచ్ఛికాన్ని సూచించారు; మ‌రి, ఒక వీడియో లింక్ ద్వారా మీ తో నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను.

మిత్రులారా,

బంగ‌బంధు శేఖ్ ముజీబుర్ ర‌హ‌హాన్ గ‌త శతాబ్ది లోని మ‌హానుభావుల లో ఒక‌రు.  వారి యావ‌త్తు జీవితం మ‌న‌కు అంద‌రి కి ఒక బ్ర‌హ్మాండ‌మైన‌ ప్రేర‌ణ గా ఉన్నది.

బంగ‌బంధు అంటే అర్థం..

ఒక ధైర్య‌శాలి అయిన నేత‌

ఒక దృఢ విశ్వాసం క‌లిగిన వ్య‌క్తి

ఒక శాంతి ప్రవచనం చేసే మనీషి

గౌర‌వానికై, స‌మాన‌త్వానికై మరియు న్యాయానికై పోరాడేటటువంటి యోద్ధ

నిర్దయ ను ఎదురించేందుకు బిగించి పట్టిన పిడికిలి, ఇంకా

బ‌ల‌ప్ర‌యోగాన్ని నిలువరించే ర‌క్షా క‌వ‌చం.

ఆయ‌న లోని ఈ ల‌క్ష‌ణాలు ఆ కాలం లో బాంగ్లాదేశ్ యొక్క విముక్తి కోసం అన్ని సవాళ్ల కు ఎదురొద్డి నిలవడానికిగాను ల‌క్ష‌ల మంది యువ‌తీ యువ‌కుల కు ఒక క్రొత్త శ‌క్తి ని ఇచ్చాయి.  ఇవాళ, బాంగ్లాదేశ్ యొక్క ప్ర‌జానీకం తమ ప్రియతమ దేశం అయినటువంటి మరియు శేఖ్ ముజీబుర్ ర‌హ‌మాన్ క‌ల‌లు గ‌న్నటువంటి ‘శోలార్ బాంగ్లా’ ను ఆవిష్క‌రించేందుకు తమకు తాముగా రేయింబ‌గ‌ళ్ళు సమర్పితం అవుతూ ఉండటాన్ని చూస్తూ ఉంటే ఇది నాకు ఎన‌లేని సంతోషాన్ని ఇస్తున్న‌ది.

మిత్రులారా,

బంగ‌బంధు యొక్క జీవితం 21వ శ‌తాబ్ది తాలూకు ప్ర‌పంచాని కి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నది.  ఏ విధం గా ఒక తిరోగ‌మ‌న ధోరణి క‌లిగిన‌ మ‌రియు క్రూర‌మైన‌ హ‌యాం ప్ర‌జాస్వామిక విలువ‌ల‌ ను అన్నిటి ని ఖాతరు చేయక ‘బాంగ్లా భూమి’ మీద అన్యాయ‌పు ఏలుబడి ని రుద్ది, ఆ దేశం యొక్క ప్ర‌జ‌ల ను విధ్వంసం చేసిందీ మ‌నం అంద‌ర‌మూ బాగా ఎరుగుదుము.

ఆయన (శేఖ్ ముజీబుర్ రహమాన్) త‌న జీవితం లోని ప్ర‌తి ఒక్క క్ష‌ణాన్ని కూడాను బాంగ్లాదేశ్ ను సర్వ నాశనం బారి నుండి మ‌రియు జాతి విధ్వంసం బారి నుండి బ‌య‌ట‌ పడవేయడానికి, మరి ఆ యొక్క దేశాన్ని ఒక స‌కారాత్మ‌క‌మైన‌, ప్ర‌గ‌తిశీల‌మైన‌ స‌మాజం లాగా మార్చ‌డానికి ధారపోశారు.  న‌కారాత్మ‌క‌త మ‌రియు ద్వేషం ఏ దేశపు అభివృద్ధి కి అయినా ఎన్న‌టికీ పునాదిరాళ్లు కాజాల‌వు అని ఆయ‌న త్రికరణ శుద్ధి గా నమ్మారు.

అయినప్పటికిని, ఆయ‌న లోని ఇవే భావాలు మ‌రియు ఆయ‌న యొక్క ప్ర‌యాస‌ లు కొంత మంది కి గిట్టలేదు;  వారు ఆయ‌న ను మ‌న మధ్య లేకుండా చేశారు.  ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా మ‌రియు శేఖ్ రెహానా గారులకు దైవం యొక్క దీవెన‌ లు లభించ‌డం బాంగ్లాదేశ్ కు మ‌రియు మ‌న‌కు అంద‌రి కి ద‌క్కిన‌టువంటి భాగ్యం.  కాక‌పోతే, ద్వేషాన్ని మ‌రియు హింస ను స‌మ‌ర్ధ‌ించే వారు వారి యొక్క సర్వ శక్తుల ను ఒడ్డారు మరి.

హింస ను మరియు భీతి ని రాజ‌కీయ అస్త్రాలు గాను, దౌత్యం గాను మార్చుకోవడమనేది ఒక దేశం యొక్క ప్ర‌జ‌ ను, ఒక సమాజాన్ని ఏ విధం గా నాశనం చేస్తుందో మ‌నం అంద‌ర‌మూ గ‌మ‌నిస్తున్నాము.  హింస యొక్క మరియు భ‌యం యొక్క సమర్ధకులు ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్న‌దీ, మరి వారు ఏ స్థితి లో ఉన్నదీ ప్ర‌పంచం చూస్తూనే ఉన్నది.  మ‌రో ప్ర‌క్క‌న, బాంగ్లాదేశ్ క్రొత్త శిఖ‌రాల ను అధిరోహిస్తూ ఉన్న‌ది.

మిత్రులారా,

బంగ‌బంధు అందించిన‌టువంటి స్ఫూర్తి తో, శేఖ్ హ‌సీనా నాయ‌క‌త్వం లో, అభివృద్ధి ప్ర‌ధాన‌మైన‌టువంటి విధానాలతో మరియు అన్ని వ‌ర్గాల‌ ను క‌లుపుకొని పోయేట‌టువంటి విధానాల తో బాంగ్లాదేశ్ మును ముందుకు కదలుతున్న‌ది.  మ‌రి ఇది నిజం గానే కొనియాడ దగ్గది.

అది ఆర్థిక వ్య‌వ‌స్థ కావ‌చ్చు, క్రీడ‌లు లేదా ఇత‌ర సామాజిక సూచిక‌ లు కావ‌చ్చు.. ప్ర‌స్తుతం బాంగ్లాదేశ్ నూత‌న కొల‌మానాల‌ ను నెలకొల్పుతున్న‌ది.  ఈ దేశం నైపుణ్యాలు, విద్యార్జ‌న‌, ఆరోగ్యం, మ‌హిళ‌ల‌ కు సాధికారిత క‌ల్ప‌న‌, మైక్రో ఫినాన్స్ ల వంటి అనేక రంగాల లో ఇదివ‌ర‌కు ఎన్న‌డూ లేనంత పురోగ‌తి ని సాధించింది.

గ‌డ‌చిన అయిదారు సంవ‌త్స‌రాల కాలం లో, బాంగ్లాదేశ్ మ‌రియు భార‌త‌దేశం ద్వైపాక్షిక సంబంధాల లో ఒక సువ‌ర్ణ అధ్యాయాన్ని లిఖించాయ‌ని, మ‌రి మ‌న భాగ‌స్వామ్యాని కి ఒక నూత‌న పార్శ్వాన్ని మ‌రియు ఒక నూత‌న దిశ ను అందించాయ‌ని ప్రస్తావిస్తున్నందుకు నేను ఎంతో సంతోషం గా ఉన్నాను.  ఇది జ‌ర‌గ‌డానికి కారణం రెండు దేశాల మ‌ధ్య ప్రవర్ధమానం అవుతున్నటువంటి విశ్వాసం; ఇందువల్ల మ‌నం భూత‌ల స‌రిహ‌ద్దు మ‌రియు స‌ముద్ర సంబంధి స‌రిహ‌ద్దు వంటి సంక్లిష్ట స‌మ‌స్య‌ల ను కలసిమెలసి ప‌రిష్క‌రించుకోగ‌లిగాము.

ఈనాడు, బాంగ్లాదేశ్ ద‌క్షిణ ఆసియా లో భార‌త‌దేశం యొక్క అతి పెద్ద వ్యాపార‌ప‌ర‌మైన భాగ‌స్వామ్య దేశం గా మాత్ర‌మే కాదు, భారతదేశ అభివృద్ధి లో కూడాను భాగ‌స్తురాలు గా ఉన్నది.  భార‌త‌దేశం లో ఉత్ప‌త్తి చేసిన విద్యుత్తు బాంగ్లాదేశ్ లోని క‌ర్మాగారాల లో, ల‌క్ష‌ల కొద్దీ గృహాల లో వెలుగుల‌ ను నింపుతున్న‌ది.  ఫ్రెండ్‌ శిప్ పైప్ లైన్ ద్వారా మ‌న సంబంధాల‌ కు ఒక క్రొత్త పార్శ్వాన్ని జతపరచడమైంది.

అది ర‌హ‌దారి మార్గం కావ‌చ్చు, రైలు మార్గం కావ‌చ్చు, వాయు మార్గం కావ‌చ్చు, జ‌ల మార్గం కావ‌చ్చు లేదా ఇంట‌ర్ నెట్ కావ‌చ్చు..  మ‌న స‌హ‌కారం అనేక రంగాల లో మ‌న రెండు దేశాల ప్ర‌జ‌ల ను మ‌రింత ఎక్కువ‌ గా క‌లుపుతున్న‌ది.

మిత్రులారా,

శ్రీ‌యుతులు టాగోర్‌, కాజీ నజ్‌రూల్‌ ఇస్లామ్‌, ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్‌, లాలాన్ శాహ్‌, జీబానందా దాస్ మ‌రియు ఈశ్వ‌ర్ చంద్ర్ విద్యాసాగ‌ర్ ల వంటి బుద్ధిజీవులు మన వార‌స‌త్వ సంపద గా ఉన్నారు.

ఈ వారసత్వాన్నే బంగ‌బంధు యొక్క ప్రేర‌ణ మ‌రియు ఆయన ఉత్తరదాయిత్వం మరింత విస్తృతం చేసివేశాయి.  ఆయ‌న యొక్క ఆద‌ర్శాలతో, ఆయ‌న యొక్క విలువ‌ల తో భార‌త‌దేశంని సదా ముడి పడి ఉన్నది.

భార‌త‌దేశం మ‌రియు బాంగ్లాదేశ్ ల ఆత్మీయ సంబంధాలు ఈ ఉమ్మ‌డి వార‌స‌త్వం తాలూకు బలమైన పునాదుల మీదనే ఠీవి గా నిలబడ్డాయి.

మ‌న ఈ యొక్క వార‌స‌త్వం, మన ఆప్యాయ సంబంధాలు, బంగ‌బంధు చూపించినటువంటి మార్గం..  ఈ ద‌శాబ్దం లో సైతం ఉభ‌య దేశాల భాగ‌స్వామ్యాని కి, ప్ర‌గ‌తి కి మ‌రియు స‌మృద్ధి కి పటిష్టమైన ఆధారస్తంభాలు గా ఉన్నాయి.

రాబోయే సంవ‌త్స‌రం లో బాంగ్లాదేశ్ యొక్క ‘విముక్తి’ జరిగి 50 సంవ‌త్స‌రాలు అవుతాయి. ఆ మరుసటి సంవత్సరం లో, అంటే 2022వ సంవ‌త్స‌రం లో, భార‌త‌దేశాని కి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు అవుతాయి.

ఈ రెండు చారిత్రిక స‌న్నివేశాలు భార‌త‌దేశం యొక్క, బాంగ్లాదేశ్ యొక్క అభివృద్ధి ని క్రొత్త ఎత్తు కు చేర్చడం తో పాటే, ఇరు దేశాల మ‌ధ్య గ‌ల మైత్రి ని కూడా పెంపొందింపచేస్తాయన్న నమ్మకం నాలో ఉంది.

మ‌రోసారి యావ‌త్తు బాంగ్లాదేశ్ కు బంగ‌బంధు శ‌తాబ్ది తాలూకు శుభాకాంక్షల తో నేను నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

జ‌య్ బాంగ్లా, జ‌య్ హింద్‌.