Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలి తో ప్రధాన మంత్రి సమావేశం

ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలి తో ప్రధాన మంత్రి సమావేశం


భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లో  ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు, అసెంబ్లీ సీనియర్ నేత శ్రీమతి యాల్ బ్రౌన్-పివెట్ తో ఆమె అధికారిక నివాసమైన హోటల్ డి లాస్సేలో మధ్యాహ్న భోజన సందర్భంగా సమావేశమయ్యారు.

 

ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఉమ్మడి విలువలను ఇరువురు నేతలు ప్రస్తావించారు. రెండు దేశాల పార్లమెంటుల మధ్య సహకారాన్ని మరింత పెంచే మార్గాలపై వారు చర్చించారు.

 

భారతదేశ విస్తృత ఎన్నికల ప్రక్రియపై ఫ్రెంచ్ పక్షం ప్రశంసలు కురిపించింది. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సాంకేతికత, సంస్కృతి సహా వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాల పై స్తంభాలపై చర్చలు జరిగాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

***