Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు


భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్ష విమానంలో పారిస్ నుంచి మార్సిలే వరకు మంగళవారం కలిసి ప్రయాణించారు. ఇద్దరు నాయకుల మధ్య సాన్నిహిత్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై వారు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం మార్సిలే చేరుకున్న తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. గత 25 సంవత్సరాలుగా బహుముఖంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల బలమైన నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు.

భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలూ వారి మధ్య చర్చకు వచ్చాయి. రక్షణ, పౌర అణుశక్తి, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలూ సమీక్షించారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపైనా చర్చించారు. తాజాగా ముగిసిన ఏఐ కార్యాచరణ సదస్సు, రానున్న భారత్ – ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం 2026 నేతృత్వంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడుల్లో సంబంధాలను మెరుగుపరచుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ విషయమై 14వ భారత్ – ఫ్రాన్స్ సీఈవోల ఫోరం నివేదికను స్వాగతించారు.

ఆరోగ్యం, సంస్కృతి, పర్యాటకం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు తదితర రంగాల్లో ప్రస్తుత సహకారంపై భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ మాక్రాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్, అంతర్జాతీయ వేదికలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని వారు హామీ ఇచ్చారు.

 చర్చల అనంతరం భారత్-ఫ్రాన్స్ సంబంధాలను వివరించే సంయుక్త ప్రకటనను ఆమోదించారు. సాంకేతికత- ఆవిష్కరణలు, పౌర అణు విద్యుత్, ముక్కోణపు సహకారం, పర్యావరణం, సంస్కృతి, ప్రజా సంబంధాల రంగాల్లో పది అంశాలు ఖరారయ్యాయి (జాబితా పొందుపరచడమైనది).

మార్సిలే సమీపంలోని తీరప్రాంత పట్టణం కాసిస్ లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ విందు ఏర్పాటు చేశారు. భారత్ లో పర్యటించాల్సిందిగా మాక్రాన్ ను శ్రీ మోదీ ఆహ్వానించారు.

ప్రధానమంత్రి ఫ్రాన్స్ పర్యటన ఫలితాల జాబితా: (2025 ఫిబ్రవరి 10-12)

 

క్ర. సం.

ఎంవోయూలు/ ఒప్పందాలు/ సవరణలు

రంగాలు

1.

భారత్, ఫ్రాన్స్  కృత్రిమ మేధ డిక్లరేషన్

సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత

2.

భారత్ – ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరం 2026 లోగో ఆవిష్కరణ

సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత

3.

ఇండో-ఫ్రెంచ్ డిజిటల్ సైన్సెస్ కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, ఫ్రాన్సుకు చెందిన  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ (ఐఎన్ఆర్ఐఏ) మధ్య ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలపై సంతకాలు. 

సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత

4.

ఫ్రెంచ్ అంకుర సంస్థల ఇంక్యుబేటర్ స్టేషన్-ఎఫ్ ద్వారా 10 భారతీయ అంకుర సంస్థలకు సహకారం. 

సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత

5.

అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్లు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పేందుకు ఆసక్తి వ్యక్తీకరణ

పౌర అణు ఇంధనం

6.

భారత అణు ఇంధన విభాగం (డీఏఈ) ఫ్రాన్సుకు చెందిన ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అండ్ అటామిక్ ఎనర్జీ కమిషనరేట్ (సీఈఏ) మధ్య అంతర్జాతీయ అణు ఇంధన భాగస్వామ్యం విషయంలో సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందం పునరుద్ధరణ

పౌర అణు ఇంధనం

7.

భారత జీసీఎన్ఈపీ, ఫ్రాన్సుకు చెందిన న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ (ఐఎన్ఎస్టీఎన్) మధ్య సహకారానికి సంబంధించి భారత డీఏఈ, ఫ్రాన్సుకు చెందిన సీఈఏ మధ్య ఒప్పందాన్ని అమలు చేయడం

పౌర అణు ఇంధనం

8.

త్రికోణాభివృద్ధిపై  సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ. 

ఇండో-పసిఫిక్/ సుస్థిరాభివృద్ధి

9.

మార్సిలేలో భారత దౌత్య కార్యాలయానికి ఉభయుల సమక్షంలో ప్రారంభోత్సవం. 

సాంస్కృతిక/ ప్రజా సంబంధాలు

10.

పర్యావరణ రంగంలో మార్పు, జీవ వైవిధ్యం, అడవులు, సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖ- పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ

పర్యావరణం