Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫ్రాన్స్‌లోని ఐటీఈఆర్ కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్


ఫ్రాన్స్‌ కదరాష్‌లోని ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) ను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈరోజు సంయుక్తంగా సందర్శించారు. ఇరువురు నాయకులకు ఐటీఈఆర్ డైరెక్టర్ జనరల్ స్వాగతం పలికారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూజన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఐటీఈఆర్ ను సందర్శించిన తొలి ప్రభుత్వాధినేతలు వీరే.

 ఐటీఈఆర్ లో జరుగుతున్న పురోగతిని, ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద టోకమాక్ నిర్మాణ కూర్పును నేతలు ప్రశంసించారు. ఇందులో 500 మెగావాట్ల ఫ్యూజన్ శక్తిని ఉత్పత్తి చేసేందుకు మండే ప్లాస్మా సృష్టి, నియంత్రణ వంటి కీలక ప్రక్రియలు జరుగుతాయి. ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఇంజినీర్లు, శాస్త్రవేత్తల కృషిని శ్రీ మోదీ, మాక్రాన్ లు అభినందించారు.

భారతదేశం గత 2 దశాబ్దాలుగా ఐటీఈఆర్ ప్రాజెక్ట్‌లో సభ్యదేశంగా భాగస్వామ్యం వహిస్తోంది. సుమారు 200 మంది భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఎల్ అండ్ టీ , ఐనాక్స్ ఇండియా, టీసీఎస్, టీసీఈ, హెచ్ సీఎల్  టెక్నాలజీస్ వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు కూడా ప్రాజెక్టులో  భాగస్వాములుగా ఉన్నాయి.