ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఫైన్‌టెక్‌కు సంబంధించి 2018 జూన్‌లో ఇండియా -సింగపూర్‌ల మధ్య సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందానికి వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలుః
.
ఫైన్ టెక్ విషయంలో పరస్పర సహకారానికి సంబంధించి ఇండియా, సింగపూర్‌లమధ్య ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో ఇండియా- సింగపూర్‌లమధ్య పరస్పర సహకారం రెండు దేశాలూ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఎపిఐ)లకు, కంప్యూటర్ భద్రతకు సంబంధించిన రెగ్యులేటరీ శాండ్‌బాక్స్, డిజిటల్ నగదు బదలీలు, చెల్లింపుల భద్రతకు, ఎలక్ట్రానికి్ బదిలీలైన (ఎన్.ఇ.టి.ఎస్)లకు సంబంధించి ఇంటిగ్రేషన్‌కు, యుపిఐ-ఫాస్ట్ పేమెంట్ అనుసంధానతకు, ఆసియా ప్రాంతంలో ఆధార్ శ్టాక్, ఈ కే.వై.సికి, నియంత్రణల విషయంలో పరస్పర సహకారానికి, ఆర్థిక మార్కెట్‌లకు సంబంధించిన పరిష్కారాలు, ఇన్సూరెన్స్ రంగం, కంప్యూటర్ భద్రతకు సంబంధించి శాండ్ బాక్స్ నమూనాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
సంయుక్త కార్యాచరణ బృందం పరిశీలనకు నివేదించిన అంశాలుః
రెగ్యులేటరీ అనుసంధానతనను మెరుగుపరిచేందుకు ఇరు దేశాలు అనుసరిస్తున్న మెరుగైన విధానాలను ఇచ్చిపుచ్చుకోవడం
1) ఫైన్‌టెక్‌కు సంబంధించి విధానాలు, రెగ్యులేషన్ల సంబంధిత అనుభవాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రోత్సహించడం.
2)ఫైన్‌టెక్ సంస్థలు, వ్యవస్తలు వివక్షారహిత విదానంలో డాటాను వాడుకునేందుకు తగిన ప్రమాణాలను రూపొందించడానికి ప్రోత్సహించడం
3) సైబర్ భద్రత, ఆర్థిక మోసాలు తదితరాలు , కొత్త కొత్త ముప్పులను ఎదుర్కోవడానికి సంబంధించి రెగ్యులేటరీ సంస్థలలో సంబంధిత అధికారుల సామర్థ్యాల పెంపు
II. పరస్పర సహకారానికి ప్రోత్సాహం
ఇండియా,సింగపూర్‌లలోని సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమ మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా
1.వివిధ సంస్థలు ఫైన్‌టెక్ రంగానికి మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం,
2.వ్యాపార, ఆర్థిక రంగానికి సంబంధించి ఫైన్‌టెక్ పరిష్కారాల అభివృద్ధికి ప్రోత్సాహం
3.ఇరుదేశాలకు సంబంధించిన వివిధ విధానాలకు అనుగుణంగా ఫైన్‌టెక్ రంగంలో ఇండియా, సింగపూర్‌లు స్టార్టప్ లప్రతిభ, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌లలో కోలాబరేషన్‌ను ప్రోత్సహించడం
III.
అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధిః
ఎ) ఇండియా, సింగపూర్‌లలోని పబ్లిక్ సిస్టమ్‌లలో ఇరు పక్షాలూ వాడేందుకు వీలు కల్పించే ఎపిఐ ల విషయంలో తగిన ప్రమాణాలు రూపొందించడానికి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్( ఎపిఐ)కు సంబంధించి అంతర్జాతీయ నమూనా తీసుకువచ్చేందుకు ప్రోత్సహించడం అనేది,
1) డిజిటల్ గుర్తింపు వాడే వారి ఈ కెవైసి, ని దేశం వెలుపలా గుర్తింపునకు వీలు కల్పించడానికి వీలు కల్పిస్తుంది
2)యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (డిఇపై) ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్‌ఫర్ (ఎఫ్.ఎ.ఎస్.టి) డిజిటల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ప్లాట్‌ఫారమ్‌ల పేమెంట్ అనుసంధానతకు వీలు కల్పించడంలో పరస్పసర సహకారం అందించడానికి అవకాశం కల్పిస్తుంది.
3)నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆప్ ఇండియా( ఎన్.పి.సి.ఐ), నెట్‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్స్ (ఎన్.ఇ.టి.ఎస్) పేమెంట్ నెట్‌వర్క్‌ల మధ్య అనుసంధానతల ద్వారా రూపే క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో పరస్పర అనుభవాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది.
4) డిపిఐ, తక్షణ ప్రతిస్పందన (క్విక్ రెస్పాన్స్) కోడ్ ఆధారిత చెల్లింపు అంగీకారానికి ఇది వీలు కల్పిస్తుంది.
5)సరిహద్దులకు ఆవల కూడా ఈ -సైన్ ద్వారా డిజిటల్ సంతకం వాడేందుకు వీలు కల్పించడం
బి) ఇండియా-సింగపూర్‌ల మధ్య పరస్పర సహకారాన్ని ఈ కింది రంగాలలో ప్రోత్సహిస్తారు.
1) డిజిటల్ గవర్నెన్స్
2) ఆర్థిక సమ్మిళతత్వం
3) ఏసియాన్ ఫైనాన్షియల్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్ (ఎ.ఎఫ్.ఐ.ఎన్) ఆజెండాలో భాగస్వామ్యం