Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిబ్రవరి 5 న ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాను సందర్శించనున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఫిబ్రవరి 5 న ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమం వద్ద ప్రధాని పుణ్యస్నానం ఆచరించి గంగామాతకు పూజలు చేస్తారు.

 

పుష్య పౌర్ణమి (జనవరి 13, 2025) నాడు ప్రారంభమైన మహాకుంభమేళా 2025 ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం. ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్న మహాకుంభమేళా ఈనెల 26 వ తేదీ మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. 

 

భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించి, పరిరక్షించాలన్న తమ నిబద్ధతకు అనుగుణంగా, పుణ్యక్షేత్రాలలో మౌలిక సదుపాయాలనూ, సౌకర్యాలను పెంచడానికి ప్రధానమంత్రి నిరంతరం క్రియాశీల చర్యలు తీసుకుంటున్నారు. అంతకు ముందు 2024 డిసెంబర్ 13న ప్రయాగ్ రాజ్ లో పర్యటించిన ప్రధానమంత్రి ప్రజలకు రాకపోకలు, సౌకర్యాలు, సేవలు మెరుగుపరిచే రూ.5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

 

 ***