న్యూఢిల్లీ సుందర్ నర్సరీలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సూఫీ సంగీతోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారు.
దేశానికి చెందిన విభిన్న కళలు సంస్కృతులను ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి ముందున్నారు. ఈ దిశగా సూఫీ సంగీతం, కవిత్వం, నృత్యానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి జహాన్-ఎ-ఖుస్రో వేడుకలో ప్రధాని పాల్గొంటున్నారు. అమీర్ ఖుస్రో ఘన వారసత్వాన్ని వేడుక చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ కళాకారులు న్యూఢిల్లీ చేరుకుంటున్నారు.
ప్రముఖ దర్శకుడు, కళాకారుడు ముజఫర్ అలీ 2001లో ప్రారంభించిన ఈ ఉత్సవం, రూమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న ఈ ఫెస్టివల్, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ జరుగుతుంది.
ఉత్సవంలో భాగంగా ఏర్పాటైన ‘టీఈహెచ్’ బజార్ (హస్తకళల బజార్)ను కూడా శ్రీ మోదీ సందర్శిస్తారు. బజార్ లో ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన అద్వితీయ కళాఖండాలను ప్రదర్శిస్తారు. చేనేత, హస్తకళల ఉత్పత్తుల గురించి తెలిపే లఘు చిత్రాల ప్రదర్శన కూడా ఉంటుంది.
***
I will be attending Jahan-e-Khusrau at 7:30 PM tomorrow, 28th February at Sunder Nursery in Delhi. This is the 25th edition of the festival, which has been a commendable effort to popularise Sufi music and culture. I look forward to witnessing Nazr-e-Krishna during tomorrow’s…
— Narendra Modi (@narendramodi) February 27, 2025