Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిబ్రవరి 21న ఢిల్లీలో ‘సోల్ నాయకత్వ సదస్సు’ తొలి సంచికను ప్రారంభించనున్న ప్రధానమంత్రి


ఫిబ్రవరి 21, ఉదయం 11 గంటల సమయంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సోల్ నాయకత్వ సదస్సు’ తొలి సంచికను ప్రారంభిస్తారుఈ సందర్భంగా ఆయన వేదికనుద్దేశించి ప్రసంగిస్తారుగౌరవ అతిథి హోదాలో పాల్గొనే భూటాన్ రాజు దాషో షెరింగ్ టోబ్గే కీలకోపన్యాసం చేస్తారు.

ఫిబ్రవరి 21, 22 తేదీల్లో నిర్వహించే సోల్ నాయకత్వ సదస్సులో రాజకీయాలుక్రీడలుకళలుమీడియాఆధ్యాత్మికంప్రజాపాలనవాణిజ్యంసాంఘిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనినాయకత్వానికి సంబంధించి తమ దృక్కోణాలుతమ జీవితాల్లోని స్ఫూర్తిదాయక అంశాలను పంచుకుంటారుసదస్సు సహకారానికినాయకత్వ ఆలోచనలకు పెద్దపీట వేస్తుందివిజయాల నుంచే కాకపరాజయాల నుంచీ పాఠాలు నేర్చుకోగలమన్న స్ఫూర్తిని యువతకు కల్పిస్తుంది.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నిబద్ధత గల నాయకులను తయారుచేయాలన్న ఆశయంతో గుజరాత్ లోని స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్ప్రారంభమవుతోందిసక్రమమైన శిక్షణ ద్వారా దేశ రాజకీయ నాయకత్వాన్ని తయారుచేయాలనిఈ క్రమంలో కేవలం రాజకీయ వారసత్వం ఆధారంగా వచ్చే అభ్యర్థులకే కాకప్రతిభఅంకితభావంప్రజా సేవపట్ల ఆసక్తి  ఆధారంగా పైకొచ్చిన వారికి చేయూతనందించాలని సంస్థ ఆశిస్తోందినేటి సమాజంలోని సంక్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొనే నాయకత్వానికి అవసరమైన దృక్పథంనైపుణ్యాలను సోల్ సంస్థ శిక్షితులకు అందిస్తుంది.

 

****