Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిబ్రవరి 17వ తేదీ న ఇకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించనున్నప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17వ తేదీ నాడు రాత్రి దాదాపు గా 7 గంటల 40 నిమిషాల కు దిల్లీ లోని హోటల్ తాజ్ పేలెస్ లో ఇకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

‘‘రిజిలియన్స్, ఇన్ ఫ్లుయెన్స్, డామినెన్స్’’ అనేది ఈ గ్లోబల్ బిజినెస్ సమిట్ యొక్క ఇతివృత్తం గా ఉంది. ఈ రెండు రోజు ల శిఖర సమ్మేళనం ఫిబ్రవరి 17వ మరియు 18వ తేదీల లో జరుగుతున్నది.

 

ఏటా జరిగే ఈ గ్లోబల్ బిజినెస్ సమిట్ కు ద టైమ్స్ గ్రూపు ఆతిథేయి గా వ్యవహరిస్తున్నది. ఈ కార్యక్రమం ఆర్థిక రంగం లో కీలక సవాళ్ళ కు పరిష్కార మార్గాల ను అందించ గోరిన ఆలోచనపరుల ను, విధాన రూపకర్తల ను, విద్య రంగ ప్రముఖులను, మరియు కార్పొరేట్ ప్రముఖుల ను ఒక ఉమ్మడి వేదిక మీద కు తీసుకు వస్తుంది. ఈ శిఖర సమ్మేళనం లో 40 సదస్సుల లో 200 మంది కి పైగా వ్యాపార రంగ ప్రముఖులు వారి అభిప్రాయాల ను వ్యక్తం చేయనున్నారు.

 

**