Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


 

 ‘న్యూ ఇండియా’ ఒక ఫిట్ ఇండియా గా కూడా ఉండాలి అని పేర్కొన్న ప్ర‌ధాన మంత్రి
     మీ జీవ‌న శైలి ని మార్చుకోండి, ఫిట్‌నెస్ ను ఒక దిన చ‌ర్య గా చేసుకోండి అంటూ భార‌త‌దేశాని కి విజ్ఞ‌ప్తి చేసిన ప్ర‌ధాన మంత్రి
     ఫిట్‌నెస్ అనేది మ‌న చారిత్ర‌క వార‌స‌త్వం లో ఒక భాగం గా ఉంది: ప‌్ర‌ధాన మంత్రి
    ‘న్యూ ఇండియా’ను ఒక ఫిట్ ఇండియా గా తీర్చిదిద్ద‌డాని కి ఒక ఆరోగ్యవంత‌మైన వ్య‌క్తి, ఒక స్వ‌స్థ కుటుంబం మ‌రియు ఒక స్వస్థ స‌మాజం ఎంత‌యినా అవ‌స‌రం:  ప‌్ర‌ధాన మంత్రి

నేడు జాతీయ క్రీడా దినం సంద‌ర్భం గా న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో ఫిట్ ఇండియా ఉద్య‌మాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.  దృఢత్వాన్ని జీవ‌న స‌ర‌ళి లో భాగం గా చేసుకోవాల‌ని దేశ ప్ర‌జ‌ల ను ప్ర‌ధాన మంత్రి కోరారు.

మేజ‌ర్ ధ్యాన్‌చంద్ యొక్క జ‌యంతి నాడు ప్ర‌జ‌ల ఉద్య‌మాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభిస్తూ ఆట తో, టెక్నిక్ తో ప్రపంచం యొక్క మనస్సు ను గెలుచుకొన్న ప్రతిభామూర్తి మేజ‌ర్ ధ్యాన్‌చంద్ కు నివాళులు అర్పించారు.  మేజ‌ర్ ధ్యాన్‌చంద్ భార‌త‌దేశాని కి ఒక స్పోర్ట్స్ ఐకాన్ గా నిల‌చారు.  వారి యొక్క ప్ర‌య‌త్నాల ద్వారా ప్ర‌పంచ క్రీడా మైదానం లో మువ్వ‌న్నెల ప‌తాకాన్ని రెప‌రెప‌లాడిస్తున్న భార‌త‌దేశపు యువ క్రీడాకారులకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  

‘‘వారు సాధించిన ప‌త‌కాలు వారి క‌ఠోర శ్ర‌మ యొక్క ఫ‌లితం మాత్ర‌మే కాదు అవి ఒక ‘న్యూ ఇండియా’ యొక్క నూత‌న‌మైన‌ విశ్వాసాని కి, మ‌రి అలాగే ఒక న‌వ‌ న‌వోన్మేషమైన‌ ఉత్సాహాని కి కూడా అద్దం పడుతున్నాయి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ ఒక జాతీయ ల‌క్ష్యం గానే కాక‌ దేశం యొక్క మహత్త్వా కాంక్ష గా కూడా నిల‌వాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  దేశ ప్ర‌జ‌ల కు ప్రేర‌ణ ను అందించే ప్ర‌య‌త్నం లో ఫిట్ ఇండియా అభియాన్ ను ప్ర‌భుత్వ‌ం ద్వారా మొదలుపెట్టవచ్చు తప్పితే దీని ని ముందుకు తీసుకుపోవలసిందీ, విజ‌య‌వంతం చేయ‌వలసిందీ ప్ర‌జ‌లే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘విజ‌యానికి దేహ దృఢ‌త్వంతో సంబంధం ఉంటుంది.  జీవనం లోని ఏ క్షేత్రం లో అయినా సరే కీర్తి కొలమానాలను ఏర్పరచే వ్యక్తుల సఫలత గాథ‌లు అన్నీ కూడాను ఒకే ఒక్క ఉమ్మ‌డి సూత్రం తో పెన‌వేయ‌బ‌డి ఉన్నాయి.  అది చాలా వ‌ర‌కు వారు దేహ ప‌టుత్వం తో ఉండటం, దేహ సౌష్ట‌వం ప‌ట్ల శ్ర‌ద్ధ‌ ను, ఆపేక్ష‌ను కలిగివుండటమూను’’ అంటూ ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

‘‘సాంకేతిక విజ్ఞానం మ‌న శారీర‌క సామ‌ర్ధ్యాన్ని క్షీణింప‌చేసింది; మ‌నం రోజువారీ దేహ దారుఢ్య ప్రోత్సాహ‌క చ‌ర్య‌ల లో పాల్గొన‌కుండా చేసింది.  మ‌రి నేడు మ‌నం మ‌న యొక్క సాంప్ర‌దాయ‌క అభ్యాసాల ను గురించిన ఎరుక లేకుండా మనుగడ సాగిస్తున్నాము.  కాలం తో పాటు మ‌న స‌మాజం ఫిట్ నెస్ కు త‌క్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ తనను దారుఢ్యం నుండి దూరం గా జరిపేసుకొంది.  ఇదివరకు ఒక వ్య‌క్తి ఎన్నో కిలో మీట‌ర్ల త‌ర‌బ‌డి కాలి న‌డ‌క‌ న పోవడ‌మో, లేదా సైకిల్ తొక్క‌ుతూ వెళ్లడ‌మో చేసే వాడు.  ఈ రోజు న మ‌నం ఎన్ని అడుగులు న‌డిచామో మొబైల్ యాప్ మనకు చెబుతోంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘భార‌త‌దేశం లో ప్ర‌స్తుతం జీవ‌న శైలి తో ముడిపడ్డ రోగాలు పెచ్చు పెరుగుతన్నాయి, వాటి తో యువ‌త‌ కూడా ప్రభావితం అవుతున్నది.  మ‌ధుమేహం, ఇంకా ర‌క్త‌పోటు కేసు లు ఎగ‌బాకుతున్నాయి.  చివ‌ర‌ కు ఇవి భార‌త‌దేశం లోని బాల‌ల్లో సైతం పరిపాటి అయిపోయాయి.  కానీ, జీవ‌నశైలి లో సాధారణమైనటువంటి మార్పు లతో ఈ రుగ్మ‌త‌ల నుండి కాపాడుకోవచ్చు.  ఈ చిన్న చిన్న జీవ‌న శైలి ప‌రివ‌ర్తన‌ల ను తీసుకొని వ‌చ్చే ఒక ప్ర‌య‌త్న‌మే ‘ఫిట్ ఇండియా అభియాన్’ ’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ఏ వృత్తి కి చెందిన ప్ర‌జ‌లు అయినా వారు శారీర‌కం గా, మాన‌సికం గా బ‌లం గా ఉంటే వారి వృత్తి లో స‌మ‌ర్ధులు గా త‌యారు అవుతారు.  శ‌రీరం దృఢం గా ఉన్న‌ట్ల‌యితే అప్పుడు మీరు మాన‌సికం గా కూడాను దృఢం గా ఉంటారు.  క్రీడ‌ల కు ఫిట్‌నెస్ తో ఒక ప్ర‌త్య‌క్ష సంబంధం ఉంది.  అయితే, ‘ఫిట్ ఇండియా అభియాన్’ అనేది ఫిట్‌నెస్ కు మించిన‌ దానిని సాధించాల‌ని ల‌క్ష్యం గా పెట్టుకొంది.  ఫిట్‌నెస్ అనేది కేవ‌లం ఒక ప‌దం కాదు,  అది ఒక ఆరోగ్య‌ప్ర‌ద‌ం అయిన‌టువంటి మ‌రియు స‌మృద్ధ‌ం అయిన‌టువంటి జీవితాని కి ఒక మూల స్తంభం.  మ‌నం ఎప్పుడయితే మ‌న దేహాల ను స‌మ‌రం కోసం స‌న్న‌ద్ధం చేసుకొంటామో అప్పుడు మ‌నం దేశాన్ని ఇనుము వ‌లే ప‌టిష్ట ప‌ర‌చిన‌ట్లు.  ఫిట్‌నెస్ అనేది మ‌న చారిత్ర‌క వార‌సత్వం లో భాగం గా ఉంది.  భార‌త‌దేశం లోని మూల‌ మూల‌నా ఆట‌లు, ఇంకా క్రీడ‌లు ఆడ‌డం జరుగుతోంది.  వారు శ‌రీరం కోస‌మై క‌ష్టిస్తున్నారంటే అటువంట‌ప్పుడు శ‌రీరం లోని అవ‌య‌వాల ప‌ట్ల శ్ర‌ద్ధ ను మ‌రియు స‌మ‌న్వ‌యాన్ని పెంచుకోవ‌డం తో పాటు మేధ కు కూడా శిక్ష‌ణ ను ఇచ్చిన‌ వారు అవుతున్న‌ట్లే.  ఒక స్వస్థ వ్య‌క్తి, ఒక ఆరోగ్య‌వంత‌మైన ప‌రివారం మ‌రియు ఒక ఆరోగ్యక‌ర‌మైన స‌మాజం.. ఇవి ‘న్యూ ఇండియా’ను ఒక ‘ఫిట్ ఇండియా’గా మార్చ‌డం కోసం అత్యావశ్యకం.
 
‘‘స్వ‌స్థ‌  వ్య‌క్తి, స్వ‌స్థ‌ ప‌రివార్ అవుర్ స్వ‌స్థ‌ స‌మాజ్ య‌హీ న‌యే భార‌త్ కో శ్రేష్ఠ్ భార‌త్ బ‌నానే కా రాస్తా హై.  నేడు జాతీయ క్రీడా దినోత్స‌వం రోజు న మ‌నం ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ను బ‌లోపేతం చేసే ప్ర‌తిజ్ఞ చేద్దాం’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.