Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫస్ట్ సోలార్ సీ.ఈ.ఓ. శ్రీ మార్క్ విడ్మార్‌ తో సమావేశమైన – ప్రధానమంత్రి

ఫస్ట్ సోలార్ సీ.ఈ.ఓ. శ్రీ మార్క్ విడ్మార్‌ తో సమావేశమైన – ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫస్ట్ సోలార్ సి.ఈ.ఓ. శ్రీ మార్క్ విడ్మార్‌ ని కలిశారు.

భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగ పరిస్థితి గురించి, ముఖ్యంగా సౌరశక్తి సామర్థ్యం గురించి, అలాగే, 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుండి 450 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే మన లక్ష్యం గురించి వారు చర్చించారు.   ఇటీవల ప్రారంభించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ( పి.ఎల్.ఐ.) పథకం ప్రయోజనాలను పొందడం ద్వారా,  ఫస్ట్ సోలార్ సంస్థకు ప్రత్యేకమైన సన్నని-ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో ఉత్పాదక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే ఆసక్తి గురించి కూడా వారు చర్చలు జరిగాయి. అదేవిధంగా, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ పరిధిలోకి భారతదేశాన్ని సమగ్రపరచడం గురించి కూడా వారు చర్చించారు. 

*****