ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు జల్‌పాయీగుడీ ని సందర్శించారు. అక్కడ ఆయన ఎన్‌హెచ్-31డి లో భాగం అయినటువంటి ఫాలాకాటా-సల్‌సాలాబాడీ సెక్షను ను నాలుగు దోవలు కలిగినదిగా విస్తరించే పనుల కు శంకుస్థాపన చేశారు. హైకోర్టు నూతన బెంచ్ ను కూడా ఆయన ప్రారంభించారు.
41.7 కి.మీ. పొడవైన ఫాలాకాటా-సల్‌సాలాబాడీ సెక్షన్ జాతీయ రహదారి ని నేశనల్ హైవేస్ డివెలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డిపి) రెండవ దశ లో భాగం గా రూపుదిద్ది ఈస్ట్ వెస్ట్ కారిడోర్ లో ఒక భాగం గా అభివృద్ధిచేయనున్నారు. ఇది ఈశాన్య ప్రాంతాన్ని సంధానించడం లో ఒక కీలకమైనటువంటి లంకె గా ఉంది. ఈ ప్రోజెక్టు ను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డిబిఎఫ్ఒటి) ప్రాతిపదికన రెండున్నర సంవత్సరాల లో పూర్తి చేసి బిల్డ్ – ఆపరేట్ – ట్రాన్స్‌ఫర్ (బిఒటి) పద్ధతి న అందజేయనున్నారు. ఈ ప్రోజెక్టు సల్‌సాలాబాడీ మరియు అలీపుర్‌దువార్ నుండి సిలీగుడీ మధ్య రహదారి మార్గం యొక్క దూరాన్ని సుమారు 50 కిలో మీటర్ల మీరకు తగ్గిస్తుంది.
జల్‌పాయీగుడీ లోని కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ఉత్తర బెంగాల్ లో దార్జిలింగ్, కలింపోంగ్, జల్‌పాయీగుడీ మరియు కూచ్ బిహార్ ప్రజల కు సత్వర న్యాయాన్ని అందిస్తుంది. ఈ నాలుగు జిల్లా ల నివాసులు ఇక మీదట 600 కిలో మీటర్ల దూరం లోని కలకత్తా ఉన్నత న్యాయ స్థానానికి వెళ్ళే బదులు 100 కి.మీ. కన్నా తక్కువ దూరం ప్రయాణించి ఈ బెంచ్ ను ఆశ్రయించవచ్చు.
**