Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయడాని కి ఫిన్‌లాండ్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి


 

ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయడం కోసం ఫిన్ లాండ్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఓ అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందాని కి (ఎంఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

లాభాలు:

ఈ అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రం యొక్క ప్ర‌ధానోద్దేశ్యాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి:

•  ప‌ర్య‌ట‌న రంగం లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌డం కోసం మ‌రియు వర్ధిల్లేటట్టు చూడడం కోసం స‌మన్వయ పూర్వ‌క‌  సంబంధాల ప్రాతిప‌దిక ను ఏర్పాటు చేయ‌డం;

•  ప‌ర్య‌ట‌న రంగాని కి సంబంధించిన స‌మాచారం, పరిచయాలు, ప్రావీణ్య‌ం వగైరా అంశాల ను ఒక పక్షాని (దేశాని)కి మ‌రొక పక్షం (దేశం) వెల్ల‌డించడం;

•  ప‌ర్య‌ట‌న విధానాన్ని రూపొందించ‌డం, అమ‌లు చేయ‌డం మ‌రియు అభివృద్ధి ప‌ర‌చ‌డం లో ప్ర‌మాణాల ను వికసింపచేయడానికి సంబంధించినటువంటి అనుభ‌వాల ను గుర్తించే సదుపాయం మరియు వాటి ని ఒక ప‌క్షాని కి మ‌రొక ప‌క్షం వెల్ల‌డించ‌డం;

•  కంపెనీ లు మ‌రియు సంస్థ ల మ‌ధ్య సంయుక్త ప‌థ‌కాలు మ‌రియు భాగ‌స్వామ్యాల గుర్తింపున కు, విస్త‌ర‌ణ కు మార్గాన్ని సుగ‌మం చేయ‌డం.  దీని కోసం ఆయా బృందాల రాక‌ పోక‌ లు, బృందాల మ‌ధ్య స‌మావేశాలు, కార్య‌శాల‌ లు, స‌ద‌స్సుల స‌హ నిర్వ‌హ‌ణ ను అవ‌లంబించడం;

•  భార‌త‌దేశాని కి మ‌రియు ఫిన్‌లాండ్ కు చెందిన నిపుణుల కు అధ్య‌య‌నాత్మ‌క యాత్ర‌ల ను నిర్వ‌హించ‌డం ద్వారా ఉత్త‌మ అభ్యాసాల ను ఇచ్చి పుచ్చుకోవడం;

•  ఇరు ప‌క్షాల కు ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాలు ఇమిడి ఉండే అంశాల లో అంత‌ర్జాతీయ ఆర్థిక స‌హాయ సంస్థ‌ ల ప‌థ‌కాల లో పాలు పంచుకోవ‌డాన్ని ప్రోత్సహించనున్నారు.