పర్యావరణం మరియు జల వాయు పరివర్తన రంగం లో సాంకేతిక సహకారం అంశం పై స్విట్జర్ లాండ్ కు మరియు భారతదేశాని కి మధ్య అవగాహన పూర్వక ఒప్పందాని కి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగి న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ఈ ఎంఒయు పై 2019వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన స్విట్జర్ లాండ్ లో సంతకాలయ్యాయి.
ప్రధాన ప్రభావం:
పర్యావరణం స్థాయి పడిపోతూ ఉన్నప్పుడు సమాజం లోని ఉత్తమ వర్గాల కన్నా సామాజికం గా, ఆర్థికం గా వంచన కు గురి అయిన వర్గాల వారి పై కాస్తంత అధికమైనటువంటి ప్రభావం పడుతుంది. పర్యావరణ పరమైన క్షీణత ను దూరం చేసే ప్రయాస తో సమాజం లోని అన్ని వర్గాల కు మెరుగైన పర్యావరణ సంబంధి వనరుల లభ్యత రూపేణా పర్యావరణం యొక్క సమానత్వ భావన కు ఉన్నతి లభించగలదు.
లాభాలు:
ఈ ఎంఒయు పర్యావరణ పరిరక్షణ మరియు సమానత్వం, ఆదాన- ప్రదానం, ఇంకా పరస్పర ప్రయోజనాల ప్రాతిపదిక న ప్రాకృతిక వనరుల నిర్వహణ రంగం లో రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని మరియు దీర్ఘకాలిక సహకారాన్ని నెలకొల్పడం తో పాటు దాని ని ప్రోత్సహించడాని కి కూడా వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియ లో రెండు దేశాల లోని చట్టం, న్యాయం తాలూకు నిబంధనల ను శిరసావహించడం జరుగుతుంది. ఇరు దేశాల మధ్య సాంకేతిక విజ్ఞానం మరియు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సార్వజనిక జవాబుదారుతనాన్ని ఇది పెంపొందింప చేస్తుంది. దీని కి తోడు, మరింత మెరుగైన పర్యావరణ పరిరక్షణ, జల వాయు పరివర్తన సంబంధిత మెరుగైన సంరక్షణ ను, మెరుగైన నిర్వహణ ను ఆవిష్కరించడం కోసం సర్వోత్తమ పద్ధతులు, ఇంకా అధునాతన సాంకేతికతల ను ఇది ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నారు.
ప్రధానాంశాలు:
ఎ) జల వాయు పరివర్తన మరియు స్థిరమైన జల నిర్వహణల కు సంబంధించిన సామర్ధ్య నిర్మాణం;
బి) నిరంతర ప్రాతిపదిక న అడవుల నిర్వహణ;
సి) పర్వత ప్రాంతాల నిరంతర అభివృద్ధి;
డి) పర్యావరణం పరం గా హాని కి తావు ఉండనటువంటి రీతి లో పట్టణ ప్రాంతాల అభివృద్ధి;
ఇ) గగన తల కాలుష్యం, భూ తల కాలుష్యం మరియు జల కాలుష్యం యొక్క సమస్యల ను పరిష్కరించడం;
ఎఫ్) స్వచ్ఛమైన మరియు నవీకరణ యోగ్యమైన శక్తి పై శ్రద్ధ వహించడం; మరియు
జి) జల వాయు పరివర్తన తాలూకు నష్ట భయాల ను తగ్గించడం.