Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప‌రీక్షా పే చ‌ర్చా’ – విద్యార్థుల‌తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి స‌మావేశం

‘ప‌రీక్షా పే చ‌ర్చా’ – విద్యార్థుల‌తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి స‌మావేశం

‘ప‌రీక్షా పే చ‌ర్చా’ – విద్యార్థుల‌తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి స‌మావేశం

‘ప‌రీక్షా పే చ‌ర్చా’ – విద్యార్థుల‌తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి స‌మావేశం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన విష‌యాల‌పై విద్యార్థుల‌తో ఈ రోజు ఒక పుర మందిర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. న్యూ ఢిల్లీ లోని తాల్ క‌టోరా స్టేడియ‌మ్ లో ఆయ‌న విద్యార్థుల వ‌ద్ద నుండి ప్ర‌శ్న‌ల‌ను ఆహ్వానించారు. Narendra Modi Mobile App, మ‌రియు MyGov వేదిక‌లు, ఇంకా వేరు వేరు టెలివిజ‌న్ వార్తా ఛాన‌ళ్ళ ద్వారా కూడా విద్యార్థులు ఆయ‌న‌కు ప్ర‌శ్న‌లు వేశారు.

ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌ను మొద‌లు పెడుతూ తాను విద్యార్థుల‌కు, వారి త‌ల్లితండ్రుల‌కు మ‌రియు కుటుంబానికి ఒక స్నేహితుడి లాగా ఈ పుర మందిర స‌మావేశానికి వ‌చ్చిన‌ట్లు చెప్పుకొన్నారు. తాను వివిధ వేదిక‌ల ద్వారా దేశ‌వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతున్న‌ట్లు ఆయన వెల్ల‌డించారు. ఆయ‌న త‌నకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సేవ‌ల‌ను గుర్తుకుతెచ్చుకొన్నారు. వారు త‌న లోప‌లి విద్యార్థిని ఈనాటికీ స‌జీవంగా అట్టిపెట్టుకొనేందుకు వీలుగా త‌గిన విలువ‌ల‌ను తనకు నేర్పించారని ప్రధాన మంత్రి అన్నారు. ప్ర‌తి ఒక్కరు వారి మనస్సు లోప‌లి విద్యార్థి ని సజీవంగా కాపాడుకోవాల‌ంటూ ఆయ‌న ఉద్భోదించారు.

సుమారు రెండు గంట‌ల పాటు సాగిన ఈ కార్య‌క్ర‌మంలో, ప్ర‌ధాన మంత్రి ఉపాధ్యాయుల పాత్ర‌, త‌ల్లితండ్రుల ఆశ‌లు, స‌హ‌చ‌రుల నుండి ఎదుర‌య్యే ఒత్తిడి, ఏకాగ్ర‌త‌, ఆదుర్దా, ఇంకా అధైర్యం వంటి వాటితో స‌హా ప‌లు అంశాల పైన విద్యార్థుల నుండి వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌ను స్వీక‌రించారు. ఆయ‌న ఇచ్చిన స‌మాధానాల‌లో చ‌మ‌త్కారం, హాస్యం నిండి ఉండ‌డంతో పాటు అనేక విభిన్న సోదాహ‌ర‌ణ‌లు కూడా చోటు చేసుకొన్నాయి.

ప‌రీక్ష‌ల తాలూకు భారాన్ని మ‌రియు వ్యాకుల‌త‌ను త‌ట్టుకోవ‌డం కోసం, ఆత్మ విశ్వాసం యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్ప‌డం కోసం స్వామి వివేకానందుల వారిని ఆయన ఉదాహ‌రించారు. కెన‌డా కు చెందిన స్నోబోర్డర్ శ్రీ మార్క్ మెక్‌మారిస్ ఒక ప్రాణాపాయ‌క‌ర‌మైన గాయం బారిన ప‌డిన త‌రువాత కేవ‌లం 11 మాసాల‌లో- ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న శీత‌కాల ఒలంపిక్ ఆట‌ల‌లో- కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకొన్న సంగ‌తిని ఆయ‌న ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

ఏకాగ్రత విష‌యం పై ప్ర‌ధాన మంత్రి సంభాషిస్తూ, ‘మ‌న్‌కీ బాత్’ (మ‌న‌సులో మాట‌) రేడియో కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా మహా క్రికెట‌ర్ శ్రీ స‌చిన్ తెండుల్ కర్ ఇచ్చిన స‌ల‌హాను గుర్తుకు తెచ్చుకొన్నారు. శ్రీ తెండుల్ కర్ తాను ప్ర‌స్తుతం ఆడే బంతి మీద మాత్ర‌మే దృష్టి పెడ‌తాన‌ని, గ‌తించిన లేదా రానున్న దానిని గురించి ఆందోళ‌న చెంద‌న‌ని చెప్పారు. ఏకాగ్ర‌త‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డంలో యోగా తోడ్పడగలద‌ని కూడా ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

స‌హ విద్యార్థుల నుండి ఎదుర‌య్యే ఒత్తిడి అంశం పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ప్ర‌తి స్ప‌ర్థ’’ (ఇత‌రుల‌తో పోటీ ప‌డ‌టం) కంటే కూడా ‘‘అనుస్ప‌ర్థ‌’’ (త‌న‌తో తాను పోటీ ప‌డ‌టం) యొక్క ప్రాముఖ్యాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఎవ‌రైనా తాను అంత‌కు ముందు సాధించిన దానిని మ‌రింత మెరుగుప‌ర‌చుకొనేందుకు మాత్ర‌మే ప్ర‌య‌త్నించాల‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌తి ఒక్క త‌ల్లి లేదా తండ్రి త‌మ పిల్ల‌ల కోసం త్యాగాలు చేస్తార‌ని ప్ర‌ధాన మంత్రి చెబుతూ, త‌ల్లితండ్రులు వారి సంతానం సాధించిన‌టువంటి విజ‌యాల‌కు సామాజిక ప్ర‌తిష్టతో ముడి పెట్టకూడద‌ంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి ఒక్క చిన్నారిలోనూ అనుపమానమైన ప్ర‌తిభలు దాగి ఉంటాయని ఆయ‌న అన్నారు.

ఒక విద్యార్థి యొక్క జీవితంలో అటు ఇంటెలెక్చువ‌ల్ క్వోశంట్ కు, ఇటు ఎమోష‌న‌ల్ క్వోశంట్ కు ప్రాముఖ్యం ఉంటుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి వివ‌రించారు.

కాల నిర్వ‌హ‌ణ అంశం గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల విష‌యంలో ఒక కాల నిర్ణ‌య ప‌ట్టిక గానీ, లేదా ఒక కార్య‌క్ర‌మ వివ‌ర‌ణ ప‌ట్టిక గానీ పూర్తి సంవ‌త్స‌రానికి త‌గిన‌ది కాద‌ని తెలిపారు. స‌ర‌ళంగా ఉంటూనే ఒక వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న కాలాన్ని మెరుగైన రీతిలో ఉప‌యోగించుకోవ‌డమే ప్రధాన‌మ‌ని ఆయ‌న సూచించారు.

 

***