పట్టణ ప్రణాళిక, పరిపాలన రంగంలో సహకారం కోసం భారతదేశం, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ (ఎస్ సి ఇ) మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎం ఒ యు) కు కేంద్ర మంత్రి మండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఎం ఒ యు పై 2015 నవంబరు 24న సంతకాలు జరిగాయి.
ఈ ఎం ఒ యు పట్టణాభివృద్ధి, పరిపాలన, మానవ వనరుల సామర్థ్యాల పెంపుదల రంగంలో భారతదేశం, సింగపూర్ లు తమ తమ అనుభవాలను పరస్పరం పంచుకొనేందుకు తోడ్పడుతుంది.