Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌యాగ్‌రాజ్ లో ప్ర‌ధాన మంత్రి: నూత‌న విమానాశ్ర‌య భ‌వ‌నానికి , కుంభ్ మేళా కై ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ కు; వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు ప్రారంభోత్స‌వం

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌యాగ్‌రాజ్ లో ఒక నూత‌న విమానాశ్ర‌య భ‌వ‌న స‌ముదాయాన్ని, అలాగే కుంభా మేళా కై ఏర్పాటు చేసిన ఒక ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ ను నేడు ప్రారంభించారు.

గంగా పూజ లో కూడా ప్ర‌ధాన మంత్రి పాలుపంచుకొన్నారు. ఆయ‌న స్వ‌చ్ఛ్ కుంభ్ ప్ర‌ద‌ర్శ‌న‌ ను సంద‌ర్శించారు. అలాగే ప్ర‌యాగ్ రాజ్ లోని అక్ష‌య్‌ వ‌ట్ ను ఆయ‌న సంద‌ర్శించారు. ప్ర‌యాగ్ రాజ్ లో గ‌ల అండావా లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ కు శంకుస్థాపన చేయ‌డ‌మో లేదా ప్రారంభించ‌డ‌మో లేదా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం ఇవ్వ‌డ‌మో చేశారు.

ఈ సంద‌ర్భం గా పెద్ద సంఖ్య‌ లో హాజ‌రైన స‌భికుల‌ ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తూ, ఈసారి అర్థ్ కుంభ్ కు త‌ర‌లి వ‌చ్చే యాత్రికులు అక్ష‌య్‌ వ‌ట్ ను కూడా సంద‌ర్శించగలుగుతారని వివ‌రించారు. ప్ర‌యాగ్‌రాజ్ కు చ‌క్క‌ని సంధానం ఏర్ప‌డేట‌ట్లుగా ప్ర‌భుత్వం సాధ్యమైన అన్ని ప్ర‌య‌త్నాలను చేస్తోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ రోజున దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేసిన టువంటి ప‌థ‌కాలు అటు మౌలిక స‌దుపాయాల‌ కు, ఇటు సంధానాని కి కూడా తోడ్ప‌డేవే అని ఆయ‌న అన్నారు. విమానాశ్ర‌య నూత‌న ట‌ర్మిన‌ల్ నిర్మాణాన్ని ఒక సంవత్సరపు రికార్డు స‌మ‌యం లో పూర్తి చేయ‌డ‌ం జరిగిందని తెలిపారు.

అర్థ్ కుంభ్ కు విచ్చేసే భ‌క్తుల‌ కు ఒక అనుపమానమైన అనుభ‌వాన్ని క‌లిగించేట‌ట్లు సాధ్యమైన అన్ని ప్ర‌య‌త్నాలను చేపట్టడం జ‌రిగిందని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. భార‌త‌దేశం యొక్క గౌరవాన్వితమైనటువంటి గ‌తాన్ని మ‌రియు గతి శీల‌మైన భ‌విష్య‌త్తు ను క‌ళ్ళ‌కు క‌ట్టే కృషి జ‌రుగుతోందని ఆయ‌న అన్నారు.

ఒక స్వ‌చ్ఛ‌మైనటువంటి గంగా న‌దిని ఆవిష్క‌రించేలా ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ విష‌యం లో మురుగు జలాల శుద్ధి ప్లాంటు లు మ‌రియు ఘాట్ ల సుంద‌రీక‌ర‌ణ ప్ర‌ముఖ పాత్ర‌ ను పోషించ‌గ‌ల‌వ‌ని ఆయ‌న తెలిపారు.

కుంభ్ అనేది భార‌త‌దేశానికి మ‌రియు భార‌తీయ‌తకు ఒక ప్రతీక అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇది మ‌న అందరినీ క‌లుపుతుంది, ‘ఏక్ భార‌త్‌, శ్రేష్ఠ భార‌త్’ తాలూకు ఒక ప్ర‌తిబింబాన్ని అందిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. కుంభ్ యొక్క నిర్వ‌హ‌ణ ఒక విశ్వాసానికి సంబంధించిన అంశం మాత్ర‌మే కాదు, అది ఒక ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వ్య‌వ‌హార‌ం, కుంభ్ సంద‌ర్శ‌న‌ కు విచ్చేసే ప్ర‌తి ఒక్కరి ప‌ట్ల శ్ర‌ద్ధ తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ‘న్యూ ఇండియా’ అటు వార‌స‌త్వాన్ని మ‌రియు ఇటు ఆధునిక‌త‌ ను ఏ విధంగా ప‌రివ్యాప్తం చేస్తుందో అర్థ్ కుంభ్ చాటిచెప్తుంద‌ని ఆయ‌న అన్నారు.

న్యాయ వ్య‌వ‌స్థ పైన అకార‌ణమైన ఒత్తిడి ని తీసుకు రావాలని కొన్ని శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని దేశ ప్ర‌జానీకం సావధానంగా ఉండాలని తాను చెప్పద‌ల‌చుకొన్నాన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ శ‌క్తులు త‌మ‌ను తాము అన్ని సంస్థ‌ ల క‌న్నా మిన్న అయిన‌టువంటివి గా భావిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.