ప్రభుత్వ నివాసాల (అనధికారిక నివాసదారుల తొలగింపు) చట్టం, 1971( పిపిఇ యాక్ట్, 1971)లోని సెక్షన్ 2, సెక్షన్ 3లకు చేసిన సవరణలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చట్టంలోని సెక్షన్ 2లోని కొత్త క్లాజులో నివాస గృహ ఆధీనానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. చట్టం సెక్షన్ బిలోని సబ్ సెక్షన్ 3ఎ కింద కొత్త సబ్ సెక్షన్ 3బిని చేర్చారు. దీని ద్వారా ఆధీనంలోని నివాస గృహాల నుండి ఖాళీ చేయించడానికి వీలుగా ప్రొవిజన్స్ ను చేర్చడం జరిగింది.
పరిమిత సమయం వరకు నివాసం ఉండేలా కేటాయించిన నివాస గృహాల నుండి, ఆమె లేదా అతడు ఆఫీసు బాధ్యతలను నిర్వహిస్తున్న సమయంలో వారికి నివాస గృహాన్ని లైసెన్సు ప్రాతిపదికగా కేటాయించినప్పుడు ఆ సమయం అయిపోగానే వాటిలోని నివాసదారులను ఖాళీ చేయించడానికిగాను ఎస్టేట్ ఆఫీసర్ కు ఈ సవరణలు ఉపయోగపడతాయి. సవరించిన చట్టం ద్వారా ఎస్టేట్ ఆఫీసర్ సమగ్రమైన విధానాలను అమలు చేయడానికి వీలుంటుంది. ఈ నివాస గృహాల్లో ఉన్న వారు వారికి ఇచ్చిన సమయం అయిపోగానే ఖాళీ చేయకపోవడం వల్ల కొత్తగా నివాస గృహాల కేటాయింపు పొందిన వారికి నివాస గృహాలు అందుబాటులో ఉండడం లేదు.
ఈ సవరణల చట్టం ప్రకారం ఇలాంటి కేసుల్లో ఎస్టేట్ ఆఫీసర్ విచారణను త్వరగా పూర్తి చేసి నిర్ణయం తీసుకోగలుగుతారు. అంతే తప్ప చట్టంలోని 4, 5, 7 సెక్షన్ ల ప్రకారం జాప్యానికి కారణమయ్యే విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉండదు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిని కొత్త సెక్షన్ ప్రకారం వెంటనే ఖాళీ చేయించడానికిగాను ఎస్టేట్ ఆఫీసర్ తక్షణ ఆదేశాలు ఇవ్వవచ్చు. ఖాళీ చేయాలని ఎస్టేట్ ఆఫీసర్ ఇచ్చిన ఆదేశాన్ని అనధికారికంగా నివాసముంటున్న వారు పాటించకపోతే వెంటనే ఎస్టేట్ ఆఫీసర్ వారిని నివాస గృహాల నుండి ఖాళీ చేయించి నివాస గృహాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. అసవరమైనప్పుడు ఈ అధికారాన్ని ఎస్టేట్ ఆఫీసర్ ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
ప్రభుత్వ నివాస గృహాల్లో అనధికారికంగా నివాసముంటున్నవారిని చాలా సులువుగా, వేగంగా ఖాళీ చేయించడానికి సవరణలు చేసిన చట్టం ఉపయోగపడుతుంది.
ఈ సవరణల తర్వాత అనధికారికంగా నివాసముంటున్నవారిని ప్రభుత్వ నివాస గృహాలనుంచి చాలా సులువుగా, వేగంగా ఖాళీ చేయించగలిగేలా కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసకుంటుంది. అలా ఖాళీ అయిన నివాస గృహాలను అర్హత గల ఉద్యోగులకు వెంటనే కేటాయించడం జరుగుతుంది. తద్వారా అర్హత గలవా రు వేచి ఉండే సమయం తగ్గుతుంది.
ప్రభుత్వ నివాస గృహాల్లో అనధికారికంగా నివాసముంటున్నవారిని సవరణల కారణంగా చాలా సులువుగా, వేగంగా ఖాళీ చేయగలిగేలా చూడటం జరుగుతుంది. సమయానికి ఖాళీ చేయకపోవడంవల్ల కొత్తగా వాటిలోకి రావాలనుకునేవారికి నివాస గృహాల లభ్యత వుండేది కాదు. ఈ సవరణల కారణంగా అర్హత వుండి నివాస గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి నివాస గృహాల అందుబాటు అధికమవుతుంది.
జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జిపిఆర్ ఎ)కి అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సవరణ కారణంగా లబ్ధి పొందుతారు.
పూర్వ రంగం:
పిపిఇ చట్టం, 1971 లోని ప్రొవిజన్స్ కింద ప్రభుత్వ నివాస గృహాల్లో ఉంటూ, కేటాయించిన సమయం తరువాత వాటిని ఖాళీ చేయకుండా అనధికారికంగా నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం ఖాళీ చేయించాలి. అయితే వారిని ఖాళీ చేయించే కార్యక్రమం సాధారణంగా చాలా సమయాన్ని తీసుకుంటోంది. తద్వారా కొత్తగా అర్హత పొందిన వారికి నివాస గృహాల లభ్యత తగ్గుతోంది.