Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ ప‌ర్య‌ట‌న దినం సంద‌ర్భంగా ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ శోభ‌ను తిల‌కించ‌వ‌ల‌సిందిగా ప్ర‌జ‌ల‌ను కోరిన ప్ర‌ధాన మంత్రి


భార‌త‌దేశం యొక్క శోభ‌ను తిల‌కించేందుకు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి ఇండియాకు త‌ర‌లి రావలసిందిగా ప్రజలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోరారు. అలాగే, దేశంలోని యువ‌తీ యువ‌కులు కూడా భార‌త‌దేశమంత‌టా ప్ర‌యాణిస్తూ ఈ దేశం యొక్క వైవిధ్యాన్ని ఆస్వాదించవలసిందని వారికి ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

‘ప్ర‌పంచ ప‌ర్య‌ట‌న దినం’ నాడు ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ యొక్క సౌంద‌ర్యాన్ని క‌నుగొన‌డం కోసం, మా ప్ర‌జ‌ల ఆతిథ్యాన్ని స్వీక‌రించ‌డం కోసం ఇక్కడకు రమ్మంటూ యావ‌త్ ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ను నేను ఆహ్వానిస్తున్నాను.

భార‌త‌దేశ‌మంతటా ప్ర‌యాణించి మ‌న చైత‌న్య‌శీలమైనటువంటి దేశం యొక్క వివిధత్వాన్ని స్వ‌యంగా చూసి ఆనందించండ‌ని ప్రత్యేకించి నా యువ మిత్రుల‌ను నేను కోరుతున్నాను’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

గ‌త ఆదివారం నాడు ‘మ‌న్ కీ బాత్’ (’మ‌న‌సులో మాట’ కార్య‌క్ర‌మం) 36వ భాగంలో ప‌ర్య‌ట‌న రంగం గురించి, అది అందించే ప్ర‌యోజ‌నాల‌ను గురించి తాను చెప్పిన మాట‌ల ఆడియో క్లిప్

https://soundcloud.com/narendramodi/unity-in-diversity-is-indias-speciality

ని కూడా ప్ర‌ధాన మంత్రి తన సందేశ పాఠానికి జ‌త చేశారు.