ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆయిల్, గ్యాస్ కంపెనీల సిఇఓలు, నిపుణులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో సంభాషించారు.
చమురు అన్వేషణ, లైసెన్సింగ్ విధానం; గ్యాస్ మార్కెటింగ్; కోల్ బెడ్ మిథేన్, కోల్ గ్యాసిఫికేషన్ విధానాల్లో గత ఏడు సంవత్సరాల కాలంలో ఆయిల్, గ్యాస్ రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలతో పాటు ఇటీవల ప్రవేశపెట్టిన ఇండియన్ గ్యాస్ ఎక్స్ఛేంజి విధానం గురించి ప్రధానమంత్రి వారితో వివరంగా చర్చించారు. “భారతదేశాన్ని ఆయిల్, గ్యాస్ రంగంలో ఆత్మనిర్భర్ చేయడం” లక్ష్యంగా ఇలాంటి సంస్కరణలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
చమురు రంగం గురించి మరింతగా మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆయిల్ రంగంపై ఫోకస్ “ఆదాయం” నుంచి “ఉత్పత్తి” గరిష్ఠం చేయడం వైపు మారిందని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో క్రూడాయిల్ స్టోరేజి సదుపాయాలు పెంచవలసిన ఆవశ్యకతను కూడా ఆయన ప్రస్తావించారు. దేశంలో త్వరితంగా పెరుగుతున్న సహజ వాయువు డిమాండు గురించి ఆయన మరింతగా మాట్లాడారు. పైప్ లైన్లు, సిటీ గ్యాస్ పంపిణీ, ఎల్ఎన్ జి రీగ్యాసిఫికేషన్ టెర్మినల్స్ వంటి ప్రస్తుత, భవిష్యత్ మౌలిక వసతుల అభివృద్ధి గురించి ప్రస్తావించారు.
2016 నుంచి జరిగిన పలు సమావేశాల్లో అందించిన సలహాలు ఆయిల్, గ్యాస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అర్ధం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయన్న విషయం ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. నిష్కపటత్వం, ఆశావాదం, అవకాశాలు గల దేశం భారత్ అని; కొత్త ఆలోచనలు, వైఖరులు, ఆవిష్కరణలు పొంగి పొరలుతున్నాయని ఆయన చెప్పారు. భారతదేశంలో చమురు అన్వేషణ, అభివృద్ధి విభాగాల్లో భాగస్వాములు కావాలని సిఇఓలు, నిపుణులను ఆయన ఆహ్వానించారు.
దేశ, విదేశీ పరిశ్రమ ప్రముఖులు రాస్ నెఫ్ట్ చైర్మన్, సిఇఓ డాక్టర్ ఇగోర్ సెషిన్; సౌదీ ఆరామ్కో సిఇఓ, ప్రెసిడెంట్ అమీన్ నాసర్; బ్రిటిష్ పెట్రోలియం సిఇఓ బెర్నార్డ్ లూనీ; ఐహెచ్ఎస్ మార్కిట్ వైస్ చైర్మన్ డాక్టర్ డేనియెల్ యెర్గిన్; ష్లుంబర్ లిమిటెడ్ సిఇఓ ఆలివర్ లీ పూచ్; రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ; వేదాంతా లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ సంభాషణలో పాల్గొన్నారు.
ఇంధన లభ్యత, ఇంధన భద్రత పెంచడంలోను, అందరికీ ఇంధనం అందుబాటు ధరలకు అందించడంలోను ఇటీవల ప్రభుత్వం సాధించిన విజయాలను వారు ప్రశంసించారు. ముందు చూపుతో కూడిన, ఆశావహమైన లక్ష్యాలతో భారతదేశం స్వచ్ఛ ఇంధనం దిశగా పరివర్తన చెందడానికి కృషి చేయడంలో ప్రధానమంత్రి నాయకత్వాన్ని వారు ప్రశంసించారు. భారతదేశం స్వచ్ఛ ఇంధన టెక్నాలజీలు త్వరిత గతిన ఆచరించడానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు ప్రస్తావిస్తూ ప్రపంచ సరఫరా వ్యవస్థలను తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించగలదన్నారు. స్థిర, సమాన ఇంధన పరివర్తన అవసరం గురించి వారు మాట్లాడుతూ స్వచ్ఛ వృద్ధి, సుస్థిరత మరింతగా ప్రోత్సహించడానికి వారు తమ అభిప్రాయాలు, సలహాలు అందించారు.
***