Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచం లో కెల్లా అతిపెద్ద భ‌గ‌వ‌ద్ గీత గ్రంథావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

ప్ర‌పంచం లో కెల్లా అతిపెద్ద భ‌గ‌వ‌ద్ గీత గ్రంథావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

ప్ర‌పంచం లో కెల్లా అతిపెద్ద భ‌గ‌వ‌ద్ గీత గ్రంథావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

ప్ర‌పంచం లో కెల్లా అతిపెద్ద భ‌గ‌వ‌ద్ గీత గ్రంథావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం


హ‌రే కృష్ణ‌, హ‌రే కృష్ణ,

ఇస్కాన్ ఛైర్మ‌న్ పూజ్య గోపాల‌ కృష్ణ మ‌హారాజ్ గారు, నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు శ్రీ మ‌హేశ్ శ‌ర్మ గారు, పార్ల‌మెంటు లో నా స‌హ స‌భ్యురాలు శ్రీ‌మ‌తి మీనాక్షి లేఖి, ఇస్కాన్ కు చెందిన ఇత‌ర ప్ర‌ముఖ స‌భ్యులు మ‌రియు మ‌హిళ‌లు, ఇంకా ఈ రోజున ఇక్క‌డ‌ కు విచ్చేసినటువంటి స‌జ్జ‌నులారా,

ఈ కార్య‌క్ర‌మం లో పాలు పంచుకోవ‌డం కోసం అమెరికా, బ్రిటన్, రష్యా మరియు హంగ‌రీ లు స‌హా అనేక దేశాల నుండి ప్ర‌జ‌లు ఇక్క‌డ కు త‌ర‌లివ‌చ్చారన్న సంగతి నా దృష్టి కి వ‌చ్చింది. మీ అంద‌రికి కృత‌జ్ఞ‌త‌ లు పలికి తీరాలి. మీకు ఇదే హృద‌య‌పూర్వ‌క స్వాగ‌తం.

మిత్రులారా, ఈ రోజు చాలా ముఖ్య‌మైన‌టువంటి రోజు అని చెప్పాలి. హ‌రే కృష్ణ, హ‌రే కృష్ణ‌. ఇది నాకు అత్యంత ప్ర‌ముఖ‌మైన రోజు. ఎందుకంటే ఈ రోజు ఉద‌యం పూట నేను ప్ర‌తిష్టాత్మ‌క‌ గాంధీ శాంతి బ‌హుమ‌తి ప్ర‌దానోత్స‌వం లో పాలుపంచుకొనే భాగ్యాని కి నోచుకొన్నాను. మ‌రి ఇక్క‌డ మ‌న దివ్య‌ గ్రంథం శ్రీ‌మ‌ద్ భ‌గ‌వ‌ద్ గీత యొక్క ఇంత‌టి ఘ‌న‌మైన ప్ర‌తి ని దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేయాల‌ని నాకు వ్రాసి పెట్టి ఉంది. ఇది నాకు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌టువంటి అవ‌కాశం. ఎలాగంటే దాదాపు రెండు ద‌శాబ్దాల క్రితం ఈ ఆల‌య ఆవ‌ర‌ణ లో కీర్తి శేషులు అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గారు శంకు స్థాప‌న చేసిన‌టువంటి ప్ర‌దేశం లోనే నేను ప్రస్తుతం నిల్చొనివున్నాను.

మిత్రులారా, శ్రీ‌మ‌ద్ భ‌గ‌వ‌ద్ గీత యొక్క ప్ర‌పంచం లో కెల్లా అతి పెద్దదైన‌టువంటి ఈ పుస్త‌కం మూడు మీట‌ర్లు పొడ‌వు తో ఉండి, 800 కిలో గ్రాముల బ‌రువు తూగుతుంది. ఇది దీని పొడ‌వు, వెడ‌ల్పు ల కార‌ణంగానే కాక శ‌తాబ్దాల త‌ర‌బ‌డి సుసంప‌న్నమైనటువంటి భార‌తీయ జ్ఞానం మ‌రియు సంప్ర‌దాయం తాలూకు ఘ‌న‌మైన తోడ్పాటు ను ప్ర‌పంచాని కి అందించినందుకు కూడా ఎంతో విశిష్ట‌మైందిగా నిలుస్తోంది. సాటి లేన‌టువంటిది అయిన ఉద్గ్రంథం గీత యొక్క రూప‌క‌ల్ప‌న లో పాలుపంచుకొన్న ఇస్కాన్ స‌భ్యులంతా యథార్థం లో ఈ అపూర్వ గ్రంథాన్ని తీసుకు రావ‌డం లో మీ యొక్క అత్యంత సృజ‌నాత్మ‌క‌త తో పాటు మీ యొక్క శ‌క్తి యుక్తుల‌ ను నియోగించారు. ఈ గీత శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు మ‌రియు స్వామి పూర్వార్థ ల యొక్క నిష్ఠ కు, భక్తి కి నిద‌ర్శ‌నం గా నిలుస్తోంది. ఈ అభినంద‌నీయ‌మైనటువంటి ప్ర‌య‌త్నానికి గాను మీరు అంద‌రూ ప్ర‌శంసాపాత్రులు. ఇది భార‌త‌దేశం యొక్క ప్రాచీన‌ మ‌రియు దివ్య‌ వివేక‌ భ‌రిత సంప్ర‌దాయం దిశ గా ప్ర‌పంచం యొక్క కుతూహ‌లాన్ని త‌ప్ప‌క పెంపొందింప‌జేయ‌గ‌ల‌దు.

మిత్రులారా, దివ్య గ్రంథం అయిన‌టువంటి భ‌గ‌వ‌ద్ గీత లో ఇవ్వ‌బ‌డిన‌టువంటి జ్ఞానాన్ని సామాన్య మాన‌వుడి కి అందించ‌డం కోసం శతాబ్దాలు గా అనేక ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అతి చిన్నదైన గీత నుండి అతి పెద్ద‌దైన గీత వ‌ర‌కు ఈ దివ్య జ్ఞానాన్ని అంద‌రికీ అందుబాటు లోకి తీసుకురావ‌డం కోసం నిరంత‌రం గా కృషి జ‌రుగుతోంది. భ‌గ‌వ‌ద్ గీత ను దేశ విదేశాల లో ప‌లు భాష‌ల లోకి సైతం అనువ‌దించ‌డం జ‌రిగింది.

మిత్రులారా, లోక‌ మాన్య బాల‌గంగాధ‌ర్ తిల‌క్ గారు జైలు లో ఉన్న కాలం లో గీతా ర‌హ‌స్యాన్ని ర‌చించారు. అందులో శ్రీ ‌కృష్ణ భ‌గ‌వానుని యొక్క నిష్కామ, కరుణరహిత క‌ర్మ యోగాన్ని గురించిలోక‌మాన్య తిల‌క్ సీదా సాదా రీతి లో మ‌రియు స్ప‌ష్ట‌మైన రీతి లో అక్ష‌ర బ‌ద్ధం చేశారు. గీత లో ఇవ్వ‌బ‌డిన సందేశం త‌త్వ‌వేత్త‌లు లేదా పండితుల మ‌ధ్య చోటు చేసుకొనేట‌టువంటి మేధోప‌ర‌మైన ప్ర‌వ‌చ‌నాల‌ కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యేది కాద‌ని, అది నీతి సంబంధ‌మైన, ఇంకా నైతిక‌త కోణం లో ఉపాఖ్యానాత్మకమైంది కూడా అంటూ ఆయ‌న వ్రాశారు. గీత యొక్క మ‌రాఠీ మ‌రియు గుజ‌రాతీ అనువాదాల‌ ను తీసుకు రావడం ద్వారా గీత తాలూకు జ్ఞానాన్ని లోక‌మాన్య తిల‌క్ మాతృ భాష స‌ముదాయానికి కూడా చేర‌వేశారు.

ఈ యొక్క గుజ‌రాతీ అనువాద గ్రంథం మ‌న జాతి పిత మహాత్మ గాంధీ లో ప్రేర‌ణ ను ర‌గిలించి గీత ను ప‌ఠించేట‌ట్టు చేసింది. ఆ త‌రువాత ఆయ‌న ‘‘భ‌గ‌వ‌ద్ గీత అకార్డింగ్ టు గాంధీ’’ని లిఖించ‌డం లో కూడా ఇది తోడ్పడింది. గాంధీ జీ త‌న ర‌చ‌న ద్వారా గీత యొక్క మ‌రొక దృష్టికోణాన్ని ప్ర‌పంచం ముందుకు తీసుకువ‌చ్చారు. మహాత్మ గాంధీ వ్రాసిన ఈ పుస్త‌కాన్ని యుఎస్ పూర్వ ప్రెసిడెంటు శ్రీ బ‌రాక్ ఒబామా కు నేను బ‌హుమ‌తి గా ఇచ్చే విశేషాధికారాని కి నోచుకొన్నాను.

మిత్రులారా,

ఈ ప్ర‌పంచానికి భార‌త‌దేశం నుండి అందించిన‌టువంటి అత్యంత స్ఫూర్తిదాయ‌క‌మైన బ‌హుమ‌తే శ్రీ‌మ‌ద్ భ‌గ‌వ‌ద్ గీత‌. గీత అనేది ఒక ప్ర‌పంచ వార‌స‌త్వం గా ఉంది. మ‌రి ఇది వేల సంవ‌త్స‌రాల పాటు ఒక ఉపాఖ్యానం గా కూడా ఉంటుంది. లోక క‌ళ్యాణం కోసం ప‌ని చేయాల‌ంటూ ప్ర‌పంచ నాయ‌కులు మొద‌లుకొని స‌గ‌టు మ‌నిషి వ‌ర‌కు ప్ర‌జ‌ల లో ఒక ప్రేర‌ణ ను గీత రేకెత్తించింది. భార‌త‌దేశం లో దాదాపు గా ప్ర‌తి ఒక్క కుటుంబం లో ప‌విత్ర‌మైన భ‌వ‌గ‌ద్ గీత గ్రంథం యొక్క ఏదో ఒక రూపాన్ని మనం ద‌ర్శించ‌వ‌చ్చును. ఇది ప్ర‌పంచ మేధావుల‌ కు ప్రేర‌ణాత్మ‌కం గా ప‌ని చేసింది. వారు గీత లో ప్ర‌వ‌చించిన‌టువంటి దివ్య‌త్వం తో అవ‌శ్యం ప్ర‌భావితులు అయ్యారు. జ్ఞానం నుండి విజ్ఞాన శాస్త్రం వ‌ర‌కు.. కురుక్షేత్ర ర‌ణ భూమి లో నుండి వెలువ‌డ్డ ఈ ప్ర‌వ‌చ‌న గ్రంథం అన్ని జీవ‌న మార్గాల‌ ను అనుస‌రించే ప్ర‌జ‌ల తో పాటు స‌ర్వుల‌ పై ప్ర‌భావాన్ని ప్రసరించింది.

మిత్రులారా, గీత, ఇంకా ఉప‌నిష‌త్తుల అధ్యయనాని కన్నా మిన్న అయినటువంటి ఆరోగ్య వ‌ర్ధ‌క‌ వ్యాప‌కమేదీ కూడాను యావ‌త్తు విశ్వం లోనే లేదు అంటూ ప్ర‌ఖ్యాత జ‌ర్మ‌న్ త‌త్వ‌వేత్త స్కోపెన్ హాయ‌ర్ వ్రాశారు. ఇది న‌న్ను శాంతి మార్గానికి తీసుకు పోయింది. మ‌రి అంతేకాకుండా నాలో ముక్తి కి సంబంధించిన‌టు వంటి చిర శాంతి తాలూకు విశ్వాసాన్ని పాదుగొల్పింది కూడా అని ఆయన పలికారు. మ‌నం బ్రిటిషు దాస్య శృంఖ‌లాల‌ లో బందీలం అయిన కాలం లో ఆయ‌న ఈ మాటల ను అన్నారు. అది మ‌న సంస్కృతి ని, సంప్ర‌దాయాల ను అణ‌చివేయ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిగిన కాలం. అంతేకాదు భార‌తీయ త‌త్వ శాస్త్రాన్ని నిందించ‌డానికి మరియు త‌క్కువ చేసి చూప‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌టువంటి కాలం కూడాను.

మిత్రులారా,

వేదిక పైన మన ఘ‌నాపాఠీ లు ఆసీనులై ఉన్నారు. అలాగే, భార‌త‌దేశం యొక్క ఘ‌న‌మైన జ్ఞానాన్ని, దివ్య‌త్వాన్ని ప్ర‌పంచం లో ప్ర‌చారం చేయ‌డానికి వారు ఎన‌లేని కృషి ని చేశారు. శ్రీ‌మ‌ద్ భ‌క్తి వేదాంత స్వామి ప్ర‌భునాథ్ జీ గారు భ‌గ‌వ‌ద్ గీత యొక్క త‌త్వం లో త‌న‌ను తాను పూర్తి గా లీనం చేసుకొన్నారు. గీత మ‌రియు స‌త్యాగ్ర‌హం సూత్రాల ను గాంధీ గారు త‌న జీవ‌నం లో ఇముడ్చుకొన్న తీరు లాగానే స్వామీజీ కి కూడాను ఈ రెండు మార్గాలు మాన‌వ జాతి కి సేవ చేసేందుకు స‌దా ప్రీతి పాత్ర‌మయ్యాయి. ఈ కార‌ణం గానే ఆయ‌న గాంధీజీ నాయ‌క‌త్వం లోని క్విట్ ఇండియా ఉద్య‌మం లో చేర‌డానికి స్ఫూర్తి ని పొందారు. దేశాని కి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత ఆయ‌న త‌న జీవితాన్ని ముక్తి తాలూకు స్ఫూర్తి ని ర‌గిలించ‌డం కోసం అంకితం చేశారు. మ‌రి ప్ర‌పంచాన్ని విమోచ‌న దిశ గా న‌డిపించారు. ఎన్నో ప్ర‌తికూల‌త‌ లు ఎదురైన‌ప్ప‌టికీ ఆయ‌న త‌న ఇచ్ఛా శ‌క్తి సంప‌న్న‌త కార‌ణం గా ఇస్కాన్ తాలూకు దార్శ‌నిక‌త ను ప‌టిష్టపరచారు. కృష్ణ చైత‌న్య మార్గం గుండా ప్ర‌పంచాన్ని న‌డిపించ‌డం లో ప్రస్తుతం ఇస్కాన్ నిమ‌గ్న‌మై వుంది.

మిత్రులారా,

గీత ఒక ప‌విత్ర గ్రంథం మాత్ర‌మే కాక జీవితం లో ఎలా ప‌య‌నించాలనే విష‌యాన్ని వివ‌రించే సిద్ధాంతం కూడాను. మ‌నం ఏ దేశాని కి చెందిన‌ వారం అయినా కావ‌చ్చు, లేదా ఏ తెగ కు అనుబంధితులమైన వారం అయినా కావ‌చ్చు, మ‌నం అంద‌రం క‌ష్ట కాలాల‌ ను ఎదుర్కొన్న వాళ్ళ‌మే. ర‌ణ స్థ‌లం లో వీరుడు అర్జునుడికి ఎదురైన‌టువంటి నిర్ణ‌య రాహిత్య స్థితి వంటి స్థితి లో మనం ఒక్కొక్క‌ సారి ప‌డిన‌ప్పుడ‌ల్లా శ్రీ‌మ‌ద్ భ‌గ‌వ‌ద్ గీత మ‌న‌ కు ఈ స‌మ‌స్య‌ల తాలూకు ప‌రిష్కార మార్గాల‌ ను చూపుతుంది. అందుకు సేవ మ‌రియు అంకిత భావం ముఖ్యం అని చెప్తుంది. మీరు ఒక విద్యార్థి గాని, లేదా ఒక దేశాని కి నేత గాని లేదా ఒక యోగి గాని అయిన‌ప్పుడు- మ‌రి మీరు నిర్ణ‌య రాహిత్యం భావ‌న‌ లో చిక్కుబ‌డ్డ‌ప్పుడు- త‌ప్ప‌క మీ యొక్క ప్ర‌శ్న‌ల‌న్నింటి కీ శ్రీ భ‌గ‌వ‌ద్ గీత లో స‌మాధానాల‌ను పొందగలుగుతారు.

ప‌విత్రమైనటువంటి గీత గ్రంథం మాన‌వాళి కి ఒక గొప్ప పుస్త‌కం అని నేను దృఢం గా న‌మ్ముతాను. జీవితం లోని ప్ర‌తి స‌మ‌స్య కు గీత లోని ఏదో ఒక శ్లోకం లో ఒక ప‌రిష్కార మార్గమంటూ క‌న‌ప‌డుతుంది. భ‌గ‌వానుడు చాలా స్ప‌ష్టం గా ఇలా చెప్పారు –

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే-యుగే || అని.

(ఈ మాటల‌కు- స‌త్ ప్ర‌వ‌ర్త‌న ప‌రుల‌ ను ర‌క్షించ‌డానికి, దుర్మార్గుల‌ ను శిక్షించ‌డాని కి; అలాగే మ‌రి ధ‌ర్మాన్ని పునః ప్ర‌తిష్టించ‌డాని కి నేను ఒక యుగం త‌రువాత మ‌రొక యుగం లో వరుసగా ఈ భూమి మీద‌కు వ‌స్తాను- అని భావం).
అంటే ‘‘ప‌ర‌మాత్మ యొక్క దివ్య శ‌క్తి ఈ లోకాన్ని దుష్ట శ‌క్తుల బారి నుండి కాపాడ‌టం కోసం మ‌రియు మాన‌వ జాతి ని ద‌గా చేసే రాక్ష‌స శ‌క్తుల‌ ను అంత‌మొందించ‌డానికి స‌ర్వ వ్యాప్తం అవుతుంది’’ అన్న మాట‌. ఈ భూమి మీద ఉన్న అన్ని దుష్ట శ‌క్తుల‌ కు మ‌నం పంపుతున్న‌ ప్ర‌బల‌మైనటువంటి సందేశం ఇదే.

సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా, ప‌ర‌మాత్మ నుండి మ‌న‌కు అందుతున్న సూచనలు ఇలాగ ఉన్నాయి.. ఆందోళ‌న‌ తో కాలాన్ని ఎందుకు వృథా పోనిస్తారు?, మిమ్మ‌ల్ని ప‌రిమార్చ గ‌లిగింది ఎవ‌రు?, మీరు అనవసరంగా భయపడటం దేనికి? మ‌నం అందరం ఖాళీ చేతుల తో జ‌న్మించాం; మ‌రి అలాగే ఈ లోకాన్ని విడిచిపెడ‌తాము కూడాను. ఈ స‌త్యం దానంత‌ట అదే మ‌న‌ లో నిస్వార్ధ‌ స‌మ‌ర్ప‌ణ భావాన్ని, అలాగే మాన‌వాళి కి మ‌రియు మ‌న ప్రియ‌త‌మ దేశాని కి సేవ చేయాలంటూ మ‌న‌ లోపల ఒక స్ఫూర్తి ని రగిలిస్తోంది.

మిత్రులారా, న్యాయాన్ని, స‌మ బుద్ధి ని మరియు సమానత్వాన్ని ప్ర‌భుత్వం యొక్క ప్ర‌తి నిర్ణ‌యం లో, విధానాల లో ఒక అంత‌ర్భాగం గా ఉంచే ప్ర‌య‌త్నాన్ని మేము చేశాం. ఈ దార్శ‌నిక‌త లో నుండే “స‌బ్‌కా సాథ్ స‌బ్‌కా వికాస్‌” నినాదం ఆవిర్భ‌వించింది. ఇది స‌మ్మిళిత అభివృద్ధి కి సంబంధించింది. అది విచ్చ‌ల‌విడి అవినీతి అడ్డుకొనే దిశ గా మా యొక్క ప‌థ‌కాల లో మ‌రియు నిర్ణ‌యాల లో మేము వేసే అడుగులు కావ‌చ్చు, లేదా స‌మాజం లో నిరాద‌ర‌ణ కు నోచుకొన్న వ‌ర్గాల సంక్షేమం కోసం మేము నిల‌క‌డ గా చేస్తున్న‌టువంటి ప్ర‌య‌త్నాలు కావ‌చ్చు- వీటి లో ప్ర‌తిబింబిస్తోంది కూడా ఈ సారమే. అభివృద్ధియుత‌ కార్య‌ాచరణ ప‌ట్టిక లో రాజ‌కీయాల కు, స్వీయ ఘ‌న‌త కు పీట వేయ‌కూడ‌ద‌ని మేము నిరంత‌రం కృషి చేస్తున్నాం.

మిత్రులారా, భార‌తీయ సంస్కృతి, భార‌తీయ విలువ‌లు మ‌రియు భార‌తీయ సంప్ర‌దాయం ఇవే ప్రపంచం లో అనేక స‌మ‌స్య‌ ల‌కు ప‌రిష్కారం అని మా ప్ర‌భుత్వం ఎల్లప్పుడూ ప‌రిగ‌ణిస్తూ వ‌చ్చింది. ప్ర‌పంచం ఇవాళ ఎదుర్కొంటున్న‌టువంటి ప్ర‌తి ఒక్క సంక్షోభానికి- అది హింస కావ‌చ్చు లేదా కుటుంబ‌ప‌ర‌మైన జ‌టిల ప‌రిస్థితి కావ‌చ్చు లేదా ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ లు కావ‌చ్చు- ప‌రిష్కార మార్గాల ను భార‌తీయ త‌త్వ శాస్త్రాలు చూపిస్తూ వ‌చ్చాయి. మా ప్ర‌భుత్వం మీ సంస్థ వంటి దార్శ‌నిక సంస్థ యొక్క తోడ్పాటు తో యోగా మ‌రియు ఆయుర్వేదం ల ద్వారా స్వ‌స్థ‌త ను పొందే దిశ‌ గా కృషి చేయ‌వ‌ల‌సింది గా పొలి కేక ను పెట్టింది. మ‌రి వీటి కి ప్ర‌పంచ వ్యాప్త ప‌రిగ‌ణన కై పాటు పడింది. త‌త్ఫ‌లితం గా ఈ రోజు న ప్ర‌పంచం ఆరోగ్యాని కి మ‌రియు స్వ‌స్థత కై యోగా వైపు, ఆయుర్వేద వైపు ప‌య‌నిస్తోంది.

మిత్రులారా,

భార‌త‌దేశ యోగ‌, ఆయుర్వేద‌, ఇంకా తత్వ సంబంధ జ్ఞానాల‌ ను స‌రైన దిశ లో ప్ర‌పంచం ఇప్ప‌టి కీ లెక్క‌ లోకి తీసుకోలేద‌నే నేను న‌మ్ముతాను. మ‌న ఉత్త‌మ విధానాలు ఇప్ప‌టి కి ఇంకా ప్ర‌పంచాని కి వెల్ల‌డి కావ‌ల‌సి వుంది.

జ్ఞాన ప‌రిర‌క్ష‌ణ లో మ‌రియు మ‌న ప్రాచీన విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తి లో త‌ల‌మున‌క‌లై ఉన్న మీ వంటి క‌ర్మ యోగులు అంద‌రూ కొత్త త‌రాన్ని వార‌స‌త్వ ప‌రిశోధ‌న లో పాలుపంచుకొనేట‌ట్లు చేసి, ఆ ప్ర‌య‌త్నం లో వారిని ముందుకు న‌డ‌పవలసిందిగా మీ అంద‌రినీ నేను అభ్య‌ర్ధిస్తున్నాను. మీకు ప్ర‌భుత్వాల వైపు నుండి మ‌ద్ధ‌తు సదా ఉంటుంది.

మ‌రొక్క‌మారు ఇస్కాన్ కు చెందిన ప్ర‌తి అనుయాయి కి, భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కీ, మాన‌వాళి ప‌ట్ల ఆప్యాయ‌త‌ ను క‌లిగి ఉండేట‌టువంటి ప్ర‌తి ప్ర‌పంచ పౌరుని కి ఈ దివ్య భ‌గ‌వ‌ద్ గీత ను ప్ర‌సాదించినందుకు గాను నా త‌ర‌ఫున హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌ల ను తెలియ‌జేస్తున్నాను.

ఈ ప‌విత్ర కార్యాని కి న‌న్నూ ఒక భాగ‌స్తుడి ని చేయ‌వ‌చ్చ‌ని భావించినందుకు గాను ఇస్కాన్ కు నేను రుణప‌డి వుంటాను. దీనికి అంత‌టికి కార‌ణ‌మైన మీకు నిజాని కి నేను ఎంతో ధ‌న్యుడి ని.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.
హ‌రే కృష్ణ‌.