ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్రీయ రాజకీయ మరియు న్యాయ సంబంధి వ్యవహారాల కార్యదర్శి శ్రీ మెంగ్ జియాంజు సమావేశమయ్యారు.
గత రెండు సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ఉన్నత స్థాయి బృందాల రాకపోకలు పెరగడాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా స్వాగతించారు. ఈ పర్యటలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అవగాహన అధికం కావడానికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2015 మే నెలలో విజయవంతంగా తాను జరిపిన చైనా పర్యటనను, 2016 సెప్టెంబరులో జి-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం కోసం హాంగ్ ఝోవు లో పర్యటించడాన్ని ప్రధాన మంత్రి ప్రేమతో గుర్తు చేసుకున్నారు.
ఉగ్రవాదంపై పోరులో ఒక దేశానికి మరొక దేశం సహకరించుకోవడం సహా పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలపై నేతలు ఇద్దరూ చర్చించారు. ప్రపంచ భద్రతకు, శాంతికి ఉగ్రవాదం భయంకరమైన బెదరింపును రువ్వుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలలో భారతదేశం, చైనా ల మధ్య సహకారం ముమ్మరం కావడాన్ని ఆయన స్వాగతించారు.
Mr. Meng Jianzhu, Secretary of the Central Political and Legal Affairs Commission of the Communist Party of China met PM @narendramodi. pic.twitter.com/xLAVwJYLPZ
— PMO India (@PMOIndia) November 9, 2016