ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మలేసియా ఉప ప్రధాని మరియు హోం మంత్రి దాతో సెరీ డాక్టర్ అహమద్ జాహిద్ బిన్ హమీదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గత సంవత్సరం తాను ఎ ఎస్ ఎ ఇ ఎన్ (ఆసియాన్), ఇంకా సంబంధిత శిఖరాగ్ర సమావేశాలతో పాటు ద్వైపాక్షిక పర్యటన రీత్యా మలేసియాను సందర్శించగా తన పర్యటన ఫలప్రదం కావడాన్ని
జ్ఞాపకం చేసుకున్నారు.
ఉగ్రవాదాన్ని, సీమాంతర నేరాలను అరికట్టడం, ఇంకా సైబర్ సెక్యూరిటీ రంగాలలో ఇరు పక్షాల సహకారాన్ని గురించి ప్రధాన మంత్రి దృష్టికి డాక్టర్ అహమద్ జాహిద్ బిన్ హమీదీ తీసుకువచ్చారు.
మలేసియా ప్రధాని సమీప భవిష్యత్తులో భారతదేశాన్ని సందర్శించడానికి రావాలన్న తన ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
Dato' Seri Dr. Ahmad Zahid Bin Hamidi, Deputy PM of Malaysia met PM @narendramodi. pic.twitter.com/XOiyMGR7v3
— PMO India (@PMOIndia) July 19, 2016