ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ అధ్యక్షులు మాన్య శ్రీ డోనాల్డ్ ట్రంప్ తో నేడు టెలిఫోన్ ద్వారా సంభాషించారు. 30 నిమిషాల పాటు సాగిన వారు ఉభయుల సంభాషణ లో ద్వైపాక్షిక అంశాలు మరియు ప్రాంతీయ అంశాలు చోటు చేసుకొన్నాయి. ఉభయ నేతల మధ్య గల ఆప్యాయత, సౌహార్థత లను ప్రతిబింబించేలా ఈ సంభాషణ సాగింది.
ఈ సంవత్సరం జూన్ నెలాఖరు లో ఒసాకా లో జి-20 శిఖర సమ్మేళనం పూర్వ రంగం లో నూ వారు సమావేశం అయినట్టు ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.
ఒసాకా లో జరిగిన వారి ద్వైపాక్షిక చర్చ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ద్వైపాక్షిక వ్యాపారం పరంగా పరస్పర ప్రయోజనాలను అందించగల అవకాశాల ను గురించి చర్చించడం కోసం యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, భారతదేశ వాణిజ్య శాఖ మంత్రి త్వరలోనే సమావేశం కాగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రాంతీయ పరిస్థితుల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ ప్రాంతం లోని కొంత మంది నాయకులు భారత్ కు వ్యతిరేకం గా హింస ను పురికొల్పే అతి చతుర వాగ్ధోరణి తో మెలగుతున్న తీరు శాంతి కి సహాయపడేది గా లేదు అని పేర్కొన్నారు. హింస కు, మరియు భయానికి తావు లేనటువంటి, అలాగే సీమాంతర ఉగ్రవాదానికి దూరంగా ఉండేటటువంటి వాతావరణాన్ని ఏర్పరచవలసిన అవసరం ముఖ్యం అని ఆయన నొక్కి పలికారు.
పేదరికం, అవిద్య మరియు వ్యాధుల తో పోరాడడం లో, ఈ మార్గాన్ని అనుసరించే ఎవరితోనైనా సహకరించాలన్నది భారతదేశం యొక్క నిబద్ధత అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
అఫ్గానిస్తాన్ స్వాతంత్య్రం సాధించుకొని ఈ రోజు కు ఒక వంద సంవత్సరాలు అయిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. సమైక్యమైన, భద్రమైన, ప్రజాస్వామ్యయుతమైన మరియు యథార్థం గా స్వతంత్రత ను కలిగివుండే అఫ్గానిస్తాన్ కై భారతదేశం దీర్ఘకాలికమూ, అచంచలమూ అయినటువంటి నిబద్ధత ను ప్రదర్శిస్తూ వుంటుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
అధ్యక్షులు శ్రీ ట్రంప్ తో క్రమం తప్పక భేటీ అవుతూ ఉన్నందుకు ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారని ప్రధాన మంత్రి వెల్లడించారు.