మాల్‌దీవ్స్ అధ్యక్షుని పదవీ స్వీకారం కార్యక్రమం లో పాలుపంచుకోవడం కోసం మాల్‌దీవ్స్ ను సందర్శించిన భారతదేశ ప్రధాన మంత్రి, శ్రేష్ఠులు శ్రీ నరేంద్ర మోదీ కి రిపబ్లిక్ ఆఫ్ మాల్ దీవ్స్ అధ్యక్షులు, శ్రేష్ఠులు శ్రీ ఇబ్రాహిమ్ మొహమద్ సోలిహ్ స్వాగతం పలికి, ధన్యవాదాలు తెలిపారు.
పదవీ స్వీకారం కార్యక్రమానికి తనను ఆహ్వానిస్తూ ప్రత్యేక ఆప్యాయత ను కనబరచినందుకు గాను అధ్యక్షుడు శ్రీ సోలిహ్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. రిపబ్లిక్ ఆఫ్ మాల్ దీవ్స్ లో శాంతి, సమృద్ధి, ఇంకా స్థిరత్వానికి అత్యావశ్యకమైన ప్రజాస్వామ్యం ససంఘటితానికి గాను భారతదేశం ప్రజల పక్షాన మాల్‌దీవ్స్ ప్రజల కు శుభాకాంక్ష లను మరియు అభినందన లను శ్రీ మోదీ వ్యక్తం చేశారు.
భారతదేశానికి, మాల్‌దీవ్స్ కు మధ్య నెలకొన్న సంబంధాల చురుకుతనాన్ని ఉభయ నేతలు గుర్తిస్తూ మాల్‌దీవ్స్ అధ్యక్షుని గా శ్రీ సోలిహ్ ఎన్నిక కావడం తో మైత్రి, సహకార గాఢ భావనలు మరింతగా బలోపేతం కాగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇరువురు నేతలు వారి సమావేశం లో హిందూ మహా సముద్రం పరిధి లో శాంతి ని, భద్రత ను పరిరక్షించుకోవడానికి ప్రాధాన్యం ఉందని, ఈ ప్రాంతం లో స్థిరత్వాన్ని కాపాడడం పట్ల ఈ ఇరు దేశాలకు ఉన్న ఆందోళనలను, ఆకాంక్షల ను పరస్పరం గుర్తెరగాలని అంగీకరించారు.
ఈ ప్రాంతం లోను, మిగతా భూభాగం లోను ఉగ్రవాదం పై పోరాడడం లో అచంచల నిబద్ధత ను మరియు ఇతోధిక సహకారాన్ని అందించుకొందామని ఉభయ నేతలు ప్రకటించారు.
అధ్యక్షుడు శ్రీ సోలిహ్ తాను పదవీ బాధ్యతలను స్వీకరించిన తరుణం లో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి వివరించారు. మాల్‌దీవ్స్ తో అభివృద్ధి సంబంధిత భాగస్వామ్యాన్ని, మరీ ముఖ్యంగా మాల్‌దీవ్స్ ప్రజల కు చేసిన వాగ్ధానాలను నెరవేర్చడం లో నూతన ప్రభుత్వానికి సహాయాన్ని అందించవలసిన మార్గాలను గురించి చర్చ జరిగింది. ముఖ్యంగా హద్దుల అవతలి దీవులకు నీటి సరఫరా తో పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థల ను ఏర్పాటు చేయవలసిన అవసరం, అలాగే గృహ నిర్మాణాన్ని, ఇంకా మౌలిక సదుపాయాల కల్పన ను వేగవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నట్లు అధ్యక్షుడు శ్రీ సోలిహ్ ప్రస్తావించారు.
నిలకడతనంతో కూడినటువంటి సామాజిక అభివృద్ధిని మరియు ఆర్థిక అభివృద్ధిని సాధించడం లో మాల్ దీవ్స్ కు భారతదేశం అండగా నిలబడుతుందని అధ్యక్షుడు శ్రీ సోలిహ్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ మాట ఇచ్చారు. మాల్ దీవ్స్ కు సాధ్యమైన అన్ని రకాలు గాను సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని, మాల్ దీవ్స్ అవసరాలను బట్టి వివరాలను రూపుదిద్దుకోవడం కోసం ఇరు పక్షాలు అతి త్వరలో భేటీ కావాలని కూడా ఆయన సూచన చేశారు.
రెండు దేశాల లో పరస్పర ప్రయోజనకారి కాగల వివిధ రంగాల లో పెట్టుబడి పెట్టేందుకు భారతీయ కంపెనీల కు అవకాశాలు విస్తృతం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ స్వాగతించారు. రెండు దేశాల పౌరులు తరచుగా ప్రయాణాలు చేయడాన్ని గమనించిన నేతలు, ఇదివరకటి వీజా ప్రక్రియ లను సరళతరం చేయవలసిన అవసరం ఉందని కూడా అంగీకరించారు.
వీలైనంత త్వరలో భారతదేశం లో ఆధికారిక పర్యటన కు తరలి రావలసిందంటూ అధ్యక్షుడు శ్రీ సోలిహ్ కు ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వానాన్ని అధ్యక్షుడు శ్రీ సోలిహ్ సహర్షంగా మన్నించారు.
అధ్యక్షుడు శ్రీ సోలిహ్ ఆగామి పర్యటన కు సంబంధించి రంగాన్ని సిద్ధం చేయడం కోసం మాల్‌దీవ్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నవంబర్ 26వ తేదీ నాడు భారతదేశం లో ఆధికారిక పర్యటన కు విచ్చేయసి చర్చలు జరుపుతారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ సమీప భవిష్యత్తు లో మాల్‌దీవ్స్ కు ఆధికారిక పర్యటన జరుపుతారన్న ఆశాభావాన్ని అధ్యక్షుడు శ్రీ సోలిహ్ వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతాపూర్వకం గా స్వీకరించారు.
**
PM @narendramodi and President @ibusolih held talks in Malé.
— PMO India (@PMOIndia) November 17, 2018
This meeting happened just after Mr. Ibrahim Mohamed Solih was sworn in as the President of the Maldives. @presidencymv pic.twitter.com/v1XqvtRaAr
Had productive discussions with President @ibusolih. pic.twitter.com/AI4pyYvvnI
— Narendra Modi (@narendramodi) November 17, 2018