Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎన్ సిసి ర్యాలీలో ప్రసంగించారు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎన్ సిసి ర్యాలీలో ప్రసంగించారు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎన్ సిసి ర్యాలీలో ప్రసంగించారు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎన్ సిసి ర్యాలీలో ప్రసంగించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ఎన్ సిసి ర్యాలీ లో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్ సిసి సైనిక విద్యార్థుల యొక్క జీవనం వారు ధరించే దుస్తుల కన్నా, వారు పాల్గొనే కవాతు, శిబిరాల కన్నా మించినటువంటిదని, ఎన్ సిసి అనుభవం ఒక లక్ష్యాన్ని గురించి సూచిస్తుందని ప్రధాన మంత్రి విశదీకరించారు.

ఎన్ సిసి అనుభవం భారతదేశం యొక్క సంక్షిప్త దర్శన భాగ్యాన్ని కలగజేస్తుందని, భారతదేశపు శక్తి మరియు భారతదేశపు వివిధత్వాన్ని అది చాటిచెబుతుందని ప్రధాన మంత్రి అన్నారు. చక్రవర్తులు, పాలకులు, ప్రభుత్వాలు.. ఇవేవీ ఒక దేశాన్ని నిర్మించజాలవు; కానీ, ఒక దేశాన్ని ఆ దేశ పౌరులు, యువతీయువకులు, వ్యవసాయదారులు, పండితులు, శాస్త్రవేత్తలు, శ్రామికగణం మరియు సదాచారపరులు కలిసి నిర్మించగలుగుతారు అని ఆయన వివరించారు.

ఎన్ సిసి సైనిక విద్యార్థులు భారతావని భవిష్యత్తుకు సంబంధించిన విశ్వాసానికి స్ఫూర్తిమూర్తులుగా నిలుస్తారని, మన యువత యొక్క శక్తికి సంబంధించిన గర్వానికి వారు ప్రతీకలుగా ఉంటారని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.

పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ఎన్ సిసి పోషిస్తున్న పాత్రను ప్రధాన మంత్రి అభినందించారు. అలాగే, డిజిటల్ లావాదేవీల దిశగానూ ఉద్యమాన్ని కొనసాగించవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు.

****