Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి ని క‌లుసుకొన్న బాంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి

ప్ర‌ధాన మంత్రి ని క‌లుసుకొన్న బాంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి

ప్ర‌ధాన మంత్రి ని క‌లుసుకొన్న బాంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో బాంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ నేడు భేటీ అయ్యారు.

డాక్ట‌ర్ అబ్దుల్ మోమెన్ విదేశాంగ మంత్రి గా నియ‌మితులైనందుకు ఆయ‌న ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. ఆయ‌న త‌న మొట్ట‌మొద‌టి విదేశీ ప‌ర్య‌ట‌న కు భార‌త‌దేశాన్ని ఎంపిక చేసుకొన్నందుకు కూడా ఆయన‌ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.

ద్వైపాక్షిక సంబంధాల లో ఇటీవ‌ల చోటు చేసుకొన్న ప‌రిణామాల ను ప్ర‌ధాన మంత్రి దృష్టి కి డాక్ట‌ర్ అబ్దుల్ మోమెన్ తీసుకు వ‌చ్చారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలు గా భార‌త్-బాంగ్లాదేశ్ సంబంధాలు ఊర్ధ్వ ముఖం గా ప‌య‌నిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్రధాని శేఖ్ హ‌సీనా గారి నూతన ప‌ద‌వీ కాలం లో ఈ వేగ గ‌తి మ‌రింత‌ గా పుంజుకొనేట‌ట్లు బాంగ్లాదేశ్ తో భార‌త‌దేశం కలసి అంకిత భావం తో ప‌ని చేస్తుంద‌ని శ్రీ మోదీ పున‌రుద్ఘాటించారు.