Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి ని క‌లుసుకొన్న‌ యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రటీజిక్ పార్ట్ న‌ర్‌ శిప్ ఫోర‌మ్‌ యొక్క బోర్డు స‌భ్యులు


యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు చెందిన ప‌రిశ్ర‌మ మ‌రియు వ్యాపార రంగాల అనుభ‌వ‌శాలి సార‌థుల తో కూడిన యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రటీజిక్ పార్ట్ న‌ర్‌ శిప్ ఫోర‌మ్‌ (యుఎస్ఐఎస్‌పిఎఫ్‌) యొక్క బోర్డు స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

అంత క్రితం జ‌రిగిన ఇండియా లీడ‌ర్ శిప్ స‌మిట్ యొక్క ప‌ర్య‌వ‌సానాల‌ను వారు ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకు వ‌చ్చారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల లో ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ లను, నియంత్ర‌ణ సంబంధ సంస్క‌ర‌ణ‌ లను వ్యాపార ప్ర‌ముఖులు ప్ర‌శంసించారు. శ‌ర వేగంగా వృద్ధి చెందుతున్న భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అందిస్తున్న ప‌ర‌స్ప‌ర లాభ‌దాయ‌క‌మైన అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకోవ‌డం కోసం భార‌త‌దేశం తో త‌మ అనుబంధాన్ని గాఢ‌త‌రం చేసుకోవాల‌ని ఉంద‌ని ఈ సంద‌ర్భం గా వారు తెలియ జేశారు.

ఆర్థిక అనుబంధం ద్వారా ఉభ‌య దేశాలు ఇది వ‌ర‌కు ఎరుగ‌ని రీతి లో లాభ‌ప‌డ్డాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. శ‌క్తి, ఆరోగ్య సంర‌క్ష‌ణ, స్టార్ట్‌-అప్‌ లు, ఇంకా డిజిట‌ల్ టెక్నాల‌జీ ల వంటి నూత‌న రంగాల లో కూడా వ్యాపారప‌ర‌మైన అవ‌కాశాల‌ ను పూర్తి గా అందిపుచ్చుకోవాల‌ంటూ యుఎస్ కంపెనీల‌ ను ఆయ‌న ప్రోత్స‌హించారు.