Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన‌ శ్రీ లంక పార్ల‌మెంటు స‌భ్యులు

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన‌ శ్రీ లంక పార్ల‌మెంటు స‌భ్యులు

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన‌ శ్రీ లంక పార్ల‌మెంటు స‌భ్యులు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో శ్రీ లంక కు చెందిన పార్లమెంటు స‌భ్యుల ప్ర‌తినిధివ‌ర్గం ఈ రోజు స‌మావేశ‌మైంది. శ్రేష్ఠులు, శ్రీ‌ లంక పార్ల‌మెంటు స‌భాప‌తి శ్రీ క‌రు జ‌య‌సూర్య ఈ బ‌హుళ ప‌క్ష ప్ర‌తినిధివ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హించారు.

భార‌త‌దేశం మ‌రియు శ్రీ లంక ల చారిత్ర‌క సంబంధాల‌ను, ఉమ్మ‌డి ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాంస్కృతిక వార‌స‌త్వాన్ని పార్ల‌మెంటేరియ‌న్ లు ప్ర‌స్తావించారు; ఉభ‌య దేశాల మ‌ధ్య సంబంధాలు ఇటీవ‌ల కొన్ని సంవ‌త్స‌రాలుగా గాఢ‌త‌రం అవుతూ ఉండ‌డం ప‌ట్ల వారు ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌త‌దేశం స‌హాయం తో శ్రీ‌ లంక లో ప్ర‌జ‌లే కేంద్ర బిందువు గా అమలవుతున్న‌టువంటి అనేక అభివృద్ధియుత‌మైన స‌హ‌కార ప‌థ‌కాలు వాటి యొక్క ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్నాయ‌ని కూడా వారు పేర్కొన్నారు. సంయుక్త ఆర్థిక ప‌థ‌కాలు శీఘ్రగతిన అమ‌లు కావ‌డం వల్ల ఇరు దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లకు మ‌రియు ప్ర‌జ‌ల‌ కు ప్ర‌యోజ‌నాలు అందుతాయని వారు అంగీకారించారు.

ప్ర‌తినిధివ‌ర్గాన్ని ప్ర‌ధాన మంత్రి స్వాగ‌తిస్తూ ఇటువంటి స‌మావేశాలు చోటు చేసుకోవ‌ల‌సిన ప్రాముఖ్యాన్ని నొక్కి ప‌లికారు. రెండు దేశాలలో రాష్ట్రీయ విధాన సభ లు, ఇంకా స్థానిక సంస్థ‌ ల మ‌ధ్య సంబంధాల‌ ను పెంపొందించేందుకు ఉద్దేశించిన నూత‌న కార్య‌క్ర‌మాలు రెండు దేశాలలో ప్ర‌జ‌లకు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాల‌ను, విశ్వాసాన్ని మరింత గణనీయమైన రీతి లో గాఢతరం చేయగ‌లుగుతాయ‌ని ఆయన అన్నారు.

***