Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన‌ యుఎస్ఎ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌రియు యుఎస్ఎ ర‌క్ష‌ణ శాఖ మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో యుఎస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మైఖేల్ పోంపియో మ‌రియు యుఎస్ రక్షణ శాఖ మంత్రి శ్రీ జేమ్స్ మేటిస్ ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

వారు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ యొక్క శుభాకాంక్ష‌ల‌ను ప్ర‌ధాన మంత్రి కి అంద‌జేశారు. అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ తో తాను జ‌రిపిన సంభాష‌ణ‌ ల‌ను ప్ర‌ధాన మంత్రి ఈ సందర్భంగా ఆప్యాయంగా గుర్తు కు తెచ్చుకొన్నారు. అలాగే, ఆయ‌న‌కు కూడా త‌న శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేయ‌వ‌ల‌సిందిగా మంత్రుల‌కు విజ్ఞప్తి చేశారు.

అంత‌ క్రితం ఈ రోజు జరిగిన 2+2 ముఖాముఖి సంభాష‌ణ‌ల కార్య‌క్ర‌మం ఫ‌ల‌ప్ర‌దమైందని, ఆ కార్యక్రమం నిర్మాణ‌త్మ‌కం గా సాగిందని ప్ర‌ధాన మంత్రి దృష్టి కి మంత్రులు తీసుకువచ్చారు. ఉభ‌య దేశాల మ‌ధ్య తొలి సారి గా 2+2 ముఖాముఖి సంభాష‌ణ‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించినందుకు గాను ఇరువురు మంత్రుల‌ ను, ఈ కార్య‌క్ర‌మం లో వారితో పాలుపంచుకొన్న కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ని మ‌రియు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి ని ప్ర‌ధాన మంత్రి అభినందించారు.