Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన యుఎఇ విదేశీ వ్యవహారాలు మ‌రియు అంత‌ర్జాతీయ స‌హ‌కారం శాఖ మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని యుఎఇ విదేశీ వ్యవహారాలు మ‌రియు అంత‌ర్జాతీయ స‌హ‌కారం శాఖ మంత్రి శ్రీ శేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్ యాన్ ఈ రోజు క‌లుసుకొన్నారు.

ఆయ‌న ప్ర‌ధాన మంత్రి కి అబూ ధాబీ యువరాజు తరఫున శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి కూడా తన వైపు నుండి ఆప్యాయంగా ప్ర‌తి శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

వ్యాపారం మ‌రియు పెట్టుబ‌డి, రక్ష‌ణ, ఇంకా ప్ర‌జా సంబంధాల‌తో స‌హా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలు ఉభయ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌ కు వ‌చ్చాయి. భార‌త‌దేశం లో శక్తి, గృహ నిర్మాణం, అవ‌స్థాప‌న, ఇంకా ఫూడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం కోసం యుఎఇ లో ఆస‌క్తి అంత‌కంత‌కు పెరుగుతోంద‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. భార‌త‌దేశంలో 44 బిలియన్ యుఎస్ డాలర్ల తో ఏర్పాటు కానున్న 60 ఎమ్ఎమ్‌టిపిఎ సామర్థ్యం కలిగివుండే పెద్ద రిఫైనరీ మరియు పెట్రోర‌సాయ‌నాల స‌ముదాయం లో పెట్టుబ‌డి పెట్టాల‌ని ఎడిఎన్ఒసి నిర్ణ‌యించుకోవ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంస‌లు కురింపించారు. దీనికి సంబంధించి సంత‌కాలు అంతకు కొద్ది సేపటి క్రితం పూర్తి కావ‌డాన్ని కూడా ప్రధాన మంత్రి స్వాగ‌తించారు.

యుఎఇ లో ప్ర‌వాసి భార‌తీయ స‌ముదాయం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు మ‌రియు అభ్యున్న‌తి కి అందిస్తున్నటువంటి తోడ్పాటు ను గురించి మంత్రి సమావేశం లో ప్ర‌స్తావించారు.