బాంగ్లాదేశ్ లో రెండు రోజుల చరిత్రాత్మక యాత్ర కు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బాంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ సమావేశమయ్యారు.
గాఢతరం అవుతున్న సౌభ్రాతృత్వ సంబంధాల ను గురించి, ఉభయ దేశాల మధ్య ఒక వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని అధిగమించ గలిగేలా సార్వభౌమాధికారం, సమానత్వం, విశ్వాసం, అవగాహన లపై ఆధారపడిన విస్తృత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేత లు వారి అభిప్రాయాల ను ఒకరి తో మరొకరు వెల్లడి చేసుకొన్నారు.
***